Feng Shui Tips: ఇంటి ఆర్ధిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలతో ఇంట్లో ఆర్ధిక స్థితిని మెరుగుపర్చుకోవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో ఆర్ధిక పరిస్థితుల సరిగా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో వివాదం లేదా చిన్న చిన్న గొడవలు తలెత్తుతుంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. డబ్బుల్లేకపోవడంతో..ఇంట్లో పిల్లల కోర్కెలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితుల్ని మెరుగుపర్చుకునేందుకు వాస్తుశాస్త్రంలో కొన్ని సూచనలున్నాయి. కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో నాటితే ఆర్ధిక సమస్యలు దూరమౌతాయట.


ఇంట్లో పచ్చదనాన్ని పెంచడమే కాకుండా అందాన్ని కూడా తీసుకొస్తుంది మనీ ప్లాంట్ మొక్క. అంతేకాదు..వాస్తుదోషాన్ని నయం చేస్తుంది. ఫేంగ్ షుయీలో ఈ మొక్కను అభివృద్ధి సూచిక మొక్కగా పిలుస్తారు. ఈ మొక్కను చాలా సులభంగా చిన్న గిన్నెలో లేదా కుండీలో కూడా పెంచవచ్చు. లేదా ఏదైనా గ్లాసు బాటిల్ లో నీళ్లు నింపి అందులో పెట్టుకోవచ్చు. అందుకే ఈ మొక్కను డ్రాయింగ్ రూమ్‌లో కూడా అమర్చుకోవచ్చు. 


మనీ ప్లాంట్ మొక్క పాదు నేలపై పాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ ను ఎప్పుడూ పైకి మాత్రమే ఎదిగేలా చేయాలి. మనీ ప్లాంట్ సంబంధం నేరుగా ఆర్ధిక వ్యవహారాలతోనే ముడిపడి ఉంటుంది. మీ ఆర్ధిక పరిస్థితిలో వృద్ధి కావాలని కోరుకుంటే..మనీ ప్లాంట్ పాదు కూడా పైకి ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడూ మనీ ప్లాంట్‌ను ఊడబీకి పాడేయడం చేయకూడదు. 


Also read: Budh Gochar 2022: అక్టోబరు 26 వరకు కన్యారాశిలో బుధుడు... రాబోయే 40 రోజులపాటు ఈరాశుల వారికి డబ్బే డబ్బు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook