Tirumala: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని (Lord Venkateswara) దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు సీతారామన్. ఆమెకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులతో ముచ్చటించిన ఆమె (Nirmala Sitharaman)... ఓ పాప ఫోటో అడగగా వెంటనే ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు రోజుల పర్యటన నిమిత్తం సీతారామన్ తిరుమలకు వచ్చారు. ఇవాళ జరుగనున్న టాక్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆమె తిరుమలకు చేరుకుని అక్కడ బస చేస్తారు. రేపు మళ్లీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని... దిల్లీకి తిరుగు పయనమవుతారు. 


కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 72,243 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,652 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. బుధవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.41కోట్లు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. 


ఆ 3 రోజులు దర్శనాలు రద్దు
ఈ నెల 24న దీపావళి, 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం రావడంతో.. ఆ రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలను రద్దు చేసింది. సూర్యగ్రహణం రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు.  గ్రహణాల రోజుల్లో ఆలయంలోని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనాల భక్తులను మాత్రమే అనుమతిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. 


Also Read: దీపావళి తర్వాత అరుదైన యోగం... ఈ 3 రాశులవారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook