Chandra Grahan 2023: తొలి చంద్రగ్రహణం ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
Chandra Grahan 2023: చంద్రుడు మరియు సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చంద్ర గ్రహణం ఎప్పుడు, ఇది భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Chandra Grahan 2023: ఖగోళంలో ఏర్పడే ముఖ్యమైన సంఘటనలలో చంద్రగ్రహణం ఒకటి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం త్వరలో సంభవించనుంది. చంద్రుడు మరియు సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. అందుకే గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధంగా భావిస్తారు. నిజానికి సూర్య, చంద్ర గ్రహణ సమయాన్ని సూతక్ కాలంగా పరిగణిస్తారు. మీరు సుతక్ సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే, దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు.
చంద్రగ్రహణం ఎప్పుడు?
ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5, శుక్రవారం జరగబోతోంది. దీనికి 15 రోజుల ముందు మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20, గురువారం నాడు సంభవించనుంది. పదిహేను రోజుల వ్యవధిలో రండు గ్రహణాలు ఏర్పడటం ప్రజల జీవితంపై పెను ప్రభావం చూపుతుంది. మొదటి చంద్రగ్రహణం 2023లో మొదటి చంద్రగ్రహణం మే 5న జరగనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనుంది. రాత్రి 8:45 గంటలకు గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:00 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం 4 గంటల 15 నిమిషాల పాటు ఉంటుంది.
సూతకం భారతదేశంలో చెల్లుతుందా?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూతకాల కాలం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు మరియు చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతక కాలంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు. అయితే భారత్‌లో చంద్రగ్రహణం కనిపించదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే దాని సూతక్ కాలం ఇండియాలో చెల్లదు. గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసి ఉంటాయి. అలాంటి సమయంలో తినడం మరియు త్రాగడం నిషేధించబడింది. ఈ టైంలో గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook