Planet Transition 2022: ఒకే నెలలో రాశి మారనున్న 5 గ్రహాలు... రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం...
Planet Transition in June 2022: వచ్చే నెలలో ఐదు గ్రహాలు రాశులు మారనున్నాయి. ఇది ఆయా రాశుల వారి జాతకంపై ప్రభావం చూపనుంది.
Planet Transition in June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కీలక పరిణామంగా పరిగణించబడుతుంది. గ్రహాలు రాశి మారినప్పుడల్లా దాని ప్రభావం రాశిచక్రంలోని 12 రాశుల వారిపై పడుతుంది. ఆ ప్రభావంతో మంచి జరగొచ్చు లేదా చెడు జరగొచ్చు. వచ్చే జూన్ నెలలో 5 గ్రహాలు రాశి మారబోతున్నాయి. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు తప్పవు. జూన్ నెలలో ఏయే గ్రహాలు రాశి మారుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
రాశి మారనున్న కుజుడు :
కుజుడు జూన్ 2న రాశి మారబోతున్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహం వ్యక్తుల జాతకంలో కృషి, ధైర్యం, బలం, శక్తికి సంకేతంగా పరిగణించబడుతుంది.
బుధ గ్రహం రాశి మార్పు :
బుధుడు జూన్ 3న రాశి మారబోతున్నాడు. వృషభ రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. గ్రహం తిరోగమనంలో ఉండటమంటే... వ్యతిరేక దిశలో కదలడమే. ఒక వ్యక్తి జాతకంలో బుధుడి సంచారం బలంగా ఉంటే... ఆ వ్యక్తి వృత్తి, విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు అనకున్నట్లే జరుగుతాయి. అన్నింటా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
రాశి మారనున్న సూర్యుడు :
గ్రహాలన్నింటికీ రారాజుగా పరిగణించే సూర్యుడు జూన్ 15న రాశి మారబోతున్నాడు. వృషభ రాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... జాతకంలో సూర్యుడి సంచారం వ్యక్తికి గౌరవాన్ని, కీర్తిని తీసుకొస్తొంది. సూర్యుడి సంచారం బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యం, ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు.
గురు గ్రహం రాశి మార్పు :
బృహస్పతి లేదా గురు గ్రహం జూన్ 20న రాశి మారనుంది. గురు గ్రహాన్ని సంపద, వైభవం, వైవాహిక జీవితం, పిల్లలు, విద్యకు కారకంగా పరిగణిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే.. ఆ వ్యక్తి అన్ని పనుల్లో విజయం సాధిస్తాడు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు పొందుతాడు.
శుక్ర సంచారం :
శుక్రుడు జూన్ 22న మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్ర గ్రహం భౌతిక ఆనందాలకు కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో శుక్ర సంచారం బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటాడు. శుక్ర సంచారం బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి సంపద, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: SSC Exams: తాగుబోతు ఇన్విజిలేటర్... పీకలదాకా తాగి ఎగ్జామ్ హాల్‌కు.. సస్పెండ్ చేసిన విద్యాధికారి
Also Read: Video: ఈ చిన్నారి సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి