Friday Remedies: శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తే..ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. జీవితంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో లక్ష్మీదేవిని ధన దేవతగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైన రోజు. జీవితంలో ధన సంపద, సుఖ సంతోషాలు లభించాలంటే..లక్ష్మీదేవిని విధి విధానాలతో పూజించాలి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి అందరిపై ప్రసన్నమౌతుందని చెబుతారు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంటిని బాగా శుభ్రం చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్ని అర్పించాలి. దీంతపాటు కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవి ఇంటికొస్తుంది. 


హిందూ మతంలో పసుపుకు విశిష్ట స్థానముంది. పసుపును శుభంగా భావిస్తారు. అందుకే గురువారం, శుక్రవారం కూడా పసుపును ఉపయోగించాలి. శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసి ఇంట్లోని ప్రధాన గుమ్మం శుభ్రపర్చుకుని..పసుపు నీళ్లు చల్లాలి. దీనివల్ల ఇల్లు పవిత్రమౌతుంది. దాంతో పాటు ఆ ఇంటికి లక్ష్మీదేవి తిరిగొస్తుంది. 


మతపరంగా చూస్తే..గంగాజలాన్ని ఇంటిని పవిత్రంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు. శుక్రవారం నాడు ఇంటిని శుభ్రపర్చిన తరువాత మొత్తం ఇంట్లో గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పవిత్రత ఉంటుంది. అటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విస్తరిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ఇంట్లో ఉంటుంది. 


శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసి..ఇంటిని శుభ్రపర్చాలి. ఐదు కన్యల్ని ఇంటికి పిలిపించాలి. వారికి ఎర్రటి చున్నీ, కొబ్బరికాయ బహుకరించాలి. ఆ తరువాత స్వీట్స్ సమర్పించి..ఆశీర్వాదం తీసుకుని గౌరవంగా సాగనంపాలి. దాంతోపాటు లక్ష్మీదేవిని మనసులో ప్రార్ధించుకోవాలి. పేదలు, ఆపన్నులకు సహాయం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది. శుక్రవారం నాడు కనీసం ఒక్క ఆపన్నుడికైనా భోజనం పెట్టాలి. దాంతోపాటు ఆర్ధికంగా సహాయం అందించాలి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని శ్రీ స్తోత్రంతో పూజించాలి. దాంతోపాటు కనకధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది.


Also read: Rahu venus conjuction : రాహువు-శుక్ర కలయిక ఎఫెక్ట్.. జూన్ 14 తర్వాత 12 రాశుల వారి జీవితంలో ఏం జరగబోతుందంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook