Gajlaxmi Rajyog Effects: నిన్న గురుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. బృహస్పతి రాకతో అదే రాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజలక్ష్మి రాజయోగం వల్ల కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురిపించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం- గజలక్ష్మి యోగం మీ రాశి యెుక్క 11వ ఇంట్లో ఏర్పడుతోంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. వీరికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
కర్కాటకం- ఈ యోగం కర్కాటక రాశి వారి జాతకంలోని 9వ ఇంట్లో ఏర్పడుతోంది. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు కెరీర్ లో అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటారు. 
కన్యారాశి- కన్యా రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. దీంతో మీ దాంపత్య జీవితం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. 


Also Read: Jupiter Transit: 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి సంచారం, పెద్ద మొత్తంలో డబ్బు మీ సొంతం!


తులారాశి- మీ రాశిలోని ఏడవ ఇంటిలో గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. మీ పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. 
మీనం - మీ రాశిచక్రం యొక్క రెండవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీరు డబ్బు ఆదా చేస్తారు. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.


Also Read: Grah yuti 2023: ఒకే రాశిలో నాలుగు పెద్ద గ్రహాలు... ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.