Ganesh Chaturthi story: వినాయక చవితి ప్రాముఖ్యత, తిథి ముహూర్తం, ఇష్టమైన ప్రసాదం
Ganesh Chaturthi story, Puja vidhi, shubh muhurat and significance: గణేష్ చతుర్థి. ఈ పండగనే వినాయక్ చతుర్థి, వినాయక చవితి అని కూడా పిలుస్తారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో అతి ముఖ్యమైన పండగ ఇది. శివ, పార్వతి తనయుడు వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా, వేడుకగా జరుపుకుంటుంటాం.
Ganesh Chaturthi 2021 Puja vidhi, shubh muhurat and significance: గణేష్ చతుర్థి. ఈ పండగనే వినాయక్ చతుర్థి, వినాయక చవితి అని కూడా పిలుస్తారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో అతి ముఖ్యమైన పండగ ఇది. శివ, పార్వతి తనయుడు వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా, వేడుకగా జరుపుకుంటుంటాం.
భక్తులకు విజయాన్ని అందించే ఆది దేవుడిగా, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా, చేసే పనిలో శుభం, లాభం (Good luck and prosperity) కలిగించే గణపతిగా.. ఇలా చెప్పుకుంటూపోతే, ఒకటేమిటి, రెండేమిటి.. లెక్కలేనన్ని పేర్లు ఆయన సొంతం. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు వినాయక చవితి పర్వదినాన్ని వేడుకలా నిర్వహించుకుంటాం. ఈ ఏడాది సెప్టెంబర్ 10.. అంటే నేటి నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.
గణపతి మట్టి విగ్రహాన్ని (Ganesha idols) ఇంట్లోకి లేదా కాలనీలోని మండపంలోకి తీసుకొచ్చి ప్రతిష్టించి తమకు కుదిరినదాన్ని, వీలుని బట్టి 11 రోజుల వరకు లేదా అంతకంటే ముందు బేసి సంఖ్య రోజుల వరకు గణపయ్యను కొలిచి చివరి నాడు వేడుకలా విగ్రహం ఊరేగింపు, నిమజ్జమం (Idols immersion) పూర్తయ్యే వరకు వినాయక చవితి ఉత్సవాలలో ప్రతీ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది.
Also read : Ganesh Chaturthi: హుస్సేన్ సాగర్‌లో PoP idols నిమజ్జనంపై హై కోర్టు కీలక ఆదేశాలు
భక్తులు ఏ కార్యం తలపెట్టినా.. ముందుగా ఆ విఘ్నేశ్వరుడిని (Lord Vignesh) ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటే ఆ పనిలో ఎదురయ్యే విఘ్నాలన్ని తొలగిపోయి చేసే పనిలో శుభం, లాభం (Shubh, laabh) చేకూరేలా వినాయకుడు ఆశీర్వదిస్తాడనేది భక్తుల బలమైన విశ్వాసం.
How lord Ganesha born - వినాయకుడి జననం:
వినాయకుడి జననం ఓ ఆసక్తికరమైన కథలా ఉంటుంది. కైలాసంలో శివుడు లేని సమయంలో పార్వతీ దేవి ఓ మట్టి బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. అలా ప్రాణం పోసుకున్న బొమ్మే వినాయకుడు. తను స్నానానికి వెళ్తూ వెళ్తూ ఎవ్వరూ లోనికి రాకుండా కాపలా కాయాల్సిందిగా తనయుడు వినాయకుడికి (Lord Vinayak) చెప్పి వెళ్తుంది. ఆమె స్నానం నుంచి ఇంకా తిరిగిరాకముందే శివుడు అక్కడికి వస్తాడు.
శివుడి (Lord Shiva) రాకను గమనించిన వినాయకుడు.. శివుడు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. తన లోకంలోనే తన భార్య వద్దే తనను అడ్డుకుంటాడా అనే ఆగ్రహంతో శివుడు ఆ బాలుడి తల నరికేస్తాడు. ఆ తర్వాత బయటికి వచ్చి చూసిన తల్లి పార్వతి హృదయం తల్లడిల్లిపోతుంది. తాను అల్లారుముద్దుగా చూసుకున్న కొడుకు తన ముందే అచేతనంగా పడి ఉండటం చూసి తీవ్ర కన్నీటి పర్యంతమవుతుంది. తన ప్రాణనాధుడు శివుడితో వాదనకు దిగుతుంది.
పార్వతి దేవి (Goddess Parvathi Devi) చెప్పింది విన్న శివుడు.. తాను చేసిన తప్పు తెలుసుకుంటాడు. అడవిలో తూర్పు ముఖాన తలపెట్టి పడుకున్న జంతువు తల తీసుకొస్తే తిరిగి వినాయకుడికి ప్రాణం పోయొచ్చునని చెప్పి అక్కడున్న వారికి చెప్పి పురమాయిస్తాడు. అలా వెళ్లిన వాళ్లు ఓ ఏనుగు తల తీసుకురాగా.. శివుడు ఆ ఏనుగు తలతోనే వినాయకుడికి ప్రాణఃప్రతిష్ట చేస్తాడు అనేది పురాణాలు చెబుతున్న కథ.
Also read : Financial lessons from Lord Vinayaka :వినాయకుడి నుంచి తెలుసుకోవాల్సి ఆర్థిక పాఠాలు ఇవే
Ganesh Chaturthi 2021 date and timings: వినాయక చవితి తిథి ప్రారంభం, ముగింపు సమయం:
సెప్టెంబర్ 10న వినాయక చవితి కాగా.. తెల్లవారితే 10వ తేదీ శుక్రవారం అనగా అర్థరాత్రి 12:18 గంటలకు చతుర్థి తిథి ప్రారంభం అవుతుంది. మళ్లీ అదే రోజు.. అంటే పదో తేదీ శుక్రవారం రాత్రి 9:57 గంటలకు తిథి గడియలు ముగుస్తాయి.
Ganesh Chaturthi prasadam recipe: వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఏంటి, ఎలా తయారు చేస్తారు ?
బొజ్జ గణపయ్య వినాయకుడికి ఉండ్రాళ్ల పాయసం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే వినాయకుడిని పూజించే సమయంలో ఆయన ముందు ఉండ్రాళ్ల పాయాసం ప్రసాదంగా (vinayakudi prasadam) అర్పించి పూజిస్తారు. ఈ ఉండ్రాళ్ల పాయసాన్నే కొంత మంది పాలతాలికలు అని కూడా పిలుస్తారు.
గణేష్ చతుర్థి నాడు (Ganesh chaturthi 2021) వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ల పాయాసం (Vundralla Payasam) లేదా పాల తాలికలకు (Pala talikalu) పేర్లు వేరయినా అవి చేసేందుకు అవసరమైన పదార్థాలు మాత్రం ఒక్కటే. గోధుమ పిండి, లేదా బియ్యం పిండిని మెత్తగా పిసికి, ఉండాళ్లుగానో లేక సన్నగా పొడుగ్గా చేసి వాటిని పాలతో ఉడకబెట్టి పాయాసం చేస్తారు. ఉండ్రాళ్లతో చేస్తే ఉండ్రాళ్ల పాయాసం అని, సన్నగా, పొడుగ్గా తాల్చి చేస్తే పాల తాలికలు అని పిలుస్తారు. పాయసమే (Payasam recipe) కాకుండా పులిహోర, శనగలు కూడా వినాయకుడికి ప్రసాదంగా అర్పిస్తారు.
Also read : Shiva puja on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? చంద్రుడి శాపం పోగొట్టిన శివుడి వరం ఏంటి ?
Vinayaka Chavithi mantra: వినాయకుడిని ప్రసన్నం చేసుకునే మంత్రం
ఓం గణ్ గణపతయే నమః
ఓం ఎకదంతాయ విద్ధ్‌మహె, వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయత్
ఓం హస్తి పిశాచి లిఖే స్వాహ
ఓం శ్రీ గణ్ సౌభాగ్య గణపతయే వర్ వరాద్ సర్వజనం మి వష్మణ్య స్వాహ
Also read : Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook