wednesday Remedies: మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పని మెుదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం. ఎందుకంటే గణపతిని (Lord Ganesha) పూజిస్తే.. ప్రతి పని విజయవంతం అవుతుందని నమ్ముతారు. సాధారణంగా వినాయకుడికి ఉండ్రాళ్లు, లడ్డూలు నైవేధ్యంగా పెడతారు. అయితే  ఈ 5 రకాల పండ్లు గణపతికి సమర్పిస్తే..ఆయన వెంటనే ప్రసన్నుడై మీరు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ 5 ప్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

>> అరటి పండు (Banana): గణేశుడికి అరటిపండును భోగంగా సమర్పించి.. ఆ ప్రసాదాన్ని మనం తింటే...అన్ని రోగాలు, దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. లంబోదరుడికి అరటిపండ్లు అంటే చాలా ఇష్టం. 
>>  వెలగ పండు (Bael Fruit): ఈ ప్రూట్ శివుడు మరియు అతని కుమారుడు గణేశుడు ఇద్దరికీ చాలా ఇష్టమైనది. వినాయకుడికి నైవేద్యంగా ఈ పండు పడితే అతడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. 


>>  సీతాఫలం (Custard apple): ఈ పండు దీపావళి సమయంలో మార్కెట్‌లోకి వస్తుంది. తినడానికి చాలా రుచిగా ఉండే ఈ పండు గణేశుడికి చాలా ఇష్టం. సీతాఫలంలో ఎన్నోరకాల పోషకాలు ఉంటాయి. 
>>  జామ (Guava): గణేశుడికి అత్యంత ఇష్టమైన ప్రూట్స్ లో జామ ఒకటి. దీనిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆయన ఆశీర్వాదంతో మీ కోరికలు నెరవేరుతాయి. 
>>  నేరేడు పండు (Jamun Fruit): ఇది సీజనల్ ప్రూట్. వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది.  వినాయకుడికి ఈ పండు అంటే చాలా ఇష్టం. సిద్ధి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. బుధవారం సాయంత్రం నేరేడు పండును భోగ్‌గా సమర్పించి మరుసటి రోజు కుటుంబ సభ్యులకు పంచాలి.


Also Read: Jupiter Transit Effect: మీనరాశిలో గురుడు సంచారం... ఏడాదిపాటు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook