Jupiter Transit Effect: మీనరాశిలో గురుడు సంచారం... ఏడాదిపాటు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!

Guru Gochar 2022: మీనరాశిలో బృహస్పతి సంచారం 3 రాశులవారికి కలిసి వస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 09:58 AM IST
  • మీనరాశిలో బృహస్పతి సంచారం
  • ఈ 3 రాశులవారికి ప్రతి పనిలోనూ విజయం
Jupiter Transit Effect: మీనరాశిలో గురుడు సంచారం... ఏడాదిపాటు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!

Jupiter Transit 2022: మీ జాతకంలో గురుడు బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి యెుక్క వైవాహిక జీవితం, ఆర్థిక స్థితి బాగుంటుంది. అంతేకాకుండా అతడికి అదృష్టం తోడై ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాడు. ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా పేర్కొంటారు.  ఈ ఏడాదిలో ఏప్రిల్‌లో బృహస్పతి తన రాశిని మార్చాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న గురుడు (Jupiter Transit In Pisces 2022).. సంవత్సరం వరకు తన రాశిని మార్చడు. ఈ సమయంలో 3 రాశులవారిపై బృహస్పతి వరాల జల్లు కురిపిస్తాడు. ఈ రాశులవారికి అపారమైన ధనాన్ని ఇస్తాడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభం (Tauruts) : గురుగ్రహం తన రాశిని మార్చిన వెంటనే వృషభ రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి. ఈ సమయంలో వీరి ఆదాయం భారీగా పెరిగింది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆగిపోయిన ధనం తిరిగి మీ చెంతకు చేరుతుంది. కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలను ఆర్జిస్తారు.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు వజ్రాన్ని ధరించడం మంచిది. 

మిథునం (Gemini): మిథున రాశి వారికి గురు గ్రహ సంచారం శుభప్రదంగా ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. మీరు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందుతారు. పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ది చెందుతుంది. మీరు నిపుణుల సలహాతో పచ్చ మరియు పుష్యరాగం ధరించవచ్చు.

కర్కాటకం (cancer): కర్కాటక రాశి వారికి మీనరాశిలో గురుగ్రహ ప్రవేశం శుభప్రదం. ఈ వ్యక్తులకు అదృష్టం ఉంటుంది. దీని సహాయంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ సమయం వ్యాపారులకు కలిసి వస్తుంది. వీరు బంగారు రత్నాన్ని ధరిస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. 

Also Read: Auspicious Things On Saturday: శనివారం వీటిలో ఏ ఒక్కటి కనిపించినా.. మీకు లాటరీ తగలడం పక్కా..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News