Sun and Venus Conjuction 2022: సూర్యుడు రాశి మారే సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో సూర్య గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో శుక్రుడు కూడా ఉన్నందునా సూర్య-శుక్ర సంయోగం ఏర్పడింది. మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సంయోగం 3 రాశుల వారికి శుభప్రదమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ మూడు రాశులేంటి.. వారికి కలిగే శుభాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం


మిథునం (Gemini): సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించేముందు.. కర్కాటక రాశిలో చివరి మూడు రోజుల సంచారం మిథున రాశి వారికి కలిసొస్తుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచన ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులు పెద్ద డీల్స్‌కి సంతకాలు చేసే అవకాశం ఉంది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారి కెరీర్ ఆశించిన స్థాయిలో ఉంటుంది.కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.


కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఇది శుభకాలం. మీ నుంచి అప్పుగా తీసుకుని చాలాకాలంగా ఆ డబ్బు తిరిగి ఇవ్వనివారు ఎట్టకేలకు ఆ నగదును తిరిగిచ్చేస్తారు. ఈ కాలంలో మీ సంపాదన గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలతో ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. కొత్త ఉద్యోగ అవకాశం లేదా జాబ్ ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారులు పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విదేశాల నుంచి ధనలాభం ఉంటుంది.


తుల (Libra) : కర్కాటక రాశిలో సూర్య-శుక్ర సంయోగం తులారాశి వారికి ఎన్నో శుభాలను కలగజేస్తుంది. రాబోయే 3 రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఉద్యోగ నిరీక్షణ తీరిపోతుంది. ఆఫీసులో అందరిచేత ప్రశంసలు పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడి ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఇతరులకు ఇవ్వాల్సి వస్తే రూపాయి ఎక్కువే ఇస్తారు తప్ప వెనక్కి తగ్గరు.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉండవచ్చు. జీ తెలుగు న్యూస్ దానిని నిర్ధారించలేదు.)


Also Read: Rakesh Jhunjhunwala Death: ఇండియన్ వారెన్ బఫెట్ 'రాకేష్ జున్‌జున్‌వాలా' కన్నుమూత..


Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook