Gold and Silver Beliefs: హిందూమత విశ్వాసాల ప్రకారం లేదా జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల లోహాలతో శుభం, అశుభం రెండూ ముడిపడి ఉన్నాయి. అందులో ఒకటి బంగారం, వెండి వస్తువులు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో బంగారం, వెండి లోహాలకు చాలా ప్రాధాన్యతే కాకుండా మహత్యం కూడా ఉంది. ఈ వస్తువులతో శుభం, అశుభం పరిణమాలు అనుసంధానితమై ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ఆభరణం లభించడం లేదా కోల్పోవడం రెండూ అశుభమేనట. అందుకే బంగారం లేదా వెండి ఎక్కడైనా దొరికితే..తీసుకురాకూడదని పెద్దలు అంటుంటారు. వాస్తవానికి ఇదంతా గురుడితో సంబంధంతో ఉంటుందట. బంగారం పోగొట్టుకుంటే..నిజ జీవితంలో గురుడి అశుభ ప్రభావం ఉంటుందట.


గతంలో బంగారాన్ని లేదా వెండిని ఎక్కువగా ఇంట్లో దాచుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో బంగారం లేదా వెండి ఉంగరాల్నిధరిస్తున్నారు. శాస్త్రం ప్రకారం బంగారం లేదా వెండి ఉంగరం పోతే..ఓ విధమైన అశుభమేనట. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట.


బంగారం వస్తువులు పోగొట్టుకుంటే..


శాస్త్రాల ప్రకారం చెవి ఉంగరాలు లేదా వస్తువులు పోగొట్టుకుంటే..అశుభమే. దీనివల్ల భవిష్యత్తులో ఏదో చెడు జరుగుతుందని చెబుతారు. అదే సమయంలో ముక్కు పుడకలు వంటివి పోవడం కూడా అశుభమే. ఇలా జరిగితే తీవ్ర అవమానాలు ఎదురౌతాయట.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుడి కాలు పట్టీ పోతే సామాజిక ప్రతిష్ఠ తగ్గిపోతుందట. అటు ఎడమకాలి పట్టీ పోతే..ఏదో తెలియని దుర్ఘటన జరగవచ్చట. శాస్త్రాల ప్రకారం గాజులు లేదా బ్రేస్‌లెట్ పోగొట్టుకోవడం అశుభమే..దీనివల్ల పరువు గౌరవ మర్యాదలు తగ్గుతాయి.


Also read: Surya Gochar 2022: నవరాత్రుల తర్వాత తుల రాశిలోకి సూర్యభగవానుడు.. ఈ రాశులవారికి లక్కే లక్కు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook