Planet Changes October 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై వివిధ రకాలుగా ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబరులో 6 గ్రహాలు సంచారం (Grah Gochar october 2022) ఉంది. ఇది ఆరు రాశులవారి జీవితంలో అనుహ్య మార్పులు తీసుకురాబోతుంది. దీంతో కొందరికి ధనలాభం, మరికొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. అక్టోబర్‌లో ఏయే గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 2022లో గ్రహాల సంచారం
మిథునంలో అంగారక సంచారం: అక్టోబర్ 16, 2022
తులారాశిలోకి సూర్యుడు ప్రవేశం: 17 అక్టోబర్ 2022 
తులారాశిలో శుక్రుడు సంచారం: 18 అక్టోబర్ 2022
మకర రాశిలో శని ప్రత్యక్ష సంచారం: 23 అక్టోబర్ 2022
బుధుడు తులారాశి ప్రవేశం: 26 అక్టోబర్ 2022
మేషరాశిలోకి బృహస్పతి: అక్టోబర్ 28, 2022


గ్రహాల మార్పు ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం
మేషం (Aries): ఈ రాశి వారికి అక్టోబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పనిలోని అడ్డంకులు తొలగిపోతాయి. బిజినెస్ పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు. 
మిథునం (Gemini): వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ప్రయాణాలు కలిసిరావు. ఇతరులతో సౌమ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఈసమయంలో మీకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.
సింహం (Leo): ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో సూర్యభగవానుడు సంచరించనున్నాడు. ఇది శుభప్రదం కాదు. దీంతో మీకు అక్టోబరు నెలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఏదైనా పనిచేసే ముందు ఆలోచించి చేయండి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 
తుల (Libra): అక్టోబర్‌లో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది.  
వృశ్చికం (Scorpio): అక్టోబర్ మాసం మీకు ఆనందంగా ఉంటుంది. మీరు కంపెనీ నుండి మంచి బోనస్, ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు అనేక రకాలుగా ఆదాయం సమకూరుతుంది. ఆఫీులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.  
కుంభం (Aquarius): మీ ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.  ఆరోగ్యం క్షీణించవచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ కాలం బాగుంటుంది. మీ కెరీర్ లో పురోగతి కొత్త అవకాశాలు రావచ్చు. తెలివిగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగండి.


Also Read: Karthika Masam 2022: కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook