Karthika Masam 2022 Significance: తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీక మాసము. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. ఈ మాసం (Karthika Masam 2022 ) శివుడు, విష్ణువు లిద్దరుకూ ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసం స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనదిగా భావిస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై.. మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు చేస్తారు. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు తొలగిపోతాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని (Lord Vishnu)కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈసారి కార్తీక మాసం నవంబరు 17న ప్రారంభమై...డిసెంబరు 15 వరకు కొనసాగుతుంది. కార్తీకమాసంలో శ్రీమహావిష్ణువు మరియు తల్లి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదో ఈ రోజు మనం తెలుసుకుందాం.
కార్తీక మాసంలో చేయవలసినవి, చేయకూడనివి..
>> కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా పుణ్యప్రదం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నదిలో లేదా ఇంట్లో గంగాజలంతో స్నానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. విష్ణువు అనుగ్రహం కురుస్తుంది.
>> ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల విష్ణువు మరియు లక్ష్మి తల్లి అనుగ్రహం లభిస్తుంది.
>> ఈ మాసంలో దీపదానం చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శారద పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు దీప దానం చేయాలి. ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది.
>> కార్తీకమాసంలో నేలపైనే నిద్రించాలనే నియమం ఉంది. ఇలా చేయడం వల్ల మనిషి మనసులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయని చెబుతారు.
>> అంతే కాదు కార్తీక మాసంలో బ్రహ్మచర్య వ్రతం కూడా పాటించాలి. ఇన్నీ నియమాలను తూ.చ. తప్పకుండా పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా విష్ణువు అనుగ్రహంతో వారు మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారు.
Also Read: Venus Transit 2022: కన్యారాశిలో శుక్రుని సంచారం.. దీపావళికి ముందు ఈ రాశులవారి ఆదాయం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook