February Planetary Transit 2023: ఫిబ్రవరి నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఈనెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు నెప్ట్యూన్ గ్రహాలు తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. ఫిబ్రవరి 7న బుధుడు మకరరాశిలోకి, ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభరాశిలోకి, ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి, ఇదే నెలలో మీనరాశిలో నెప్ట్యూన్ సంచారం కూడా ఉంది. నెప్ట్యూన్‌ను "వరుణ గ్రహం" అని కూడా అంటారు. ఈ గ్రహాల గమనంలోని మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది.  ఈ ఫ్లానెట్స్ జోడాయిక్ ఛేంజ్ వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం: గ్రహాల సంచారం మేషరాశివారికి మేలు చేస్తుంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వీరి సహాయంతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 
కర్కాటక రాశి: ఫిబ్రవరి 2023లో జరిగే గ్రహ కదలికల వల్ల కర్కాటక రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. మీ పూర్వీకుల ఆస్తి నుండి లాభాలను పొందుతారు. శుక్రుని ప్రభావంతో వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈసమయంలో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సూర్యుని ప్రభావంతో మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. 
కన్య: ఫిబ్రవరిలో గ్రహాల రాశి మార్పు కన్యారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు డబ్బును ఆదా చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి  లాభాలు ఉంటాయి.


తుల: ఫిబ్రవరి నెల తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.  దంపతులకు పిల్లలు కలుగుతారు. మీరు సొంతంగా వ్యాపారాన్ని మెుదలుపెడతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు.. ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 
కుంభం: ఫిబ్రవరి నెల కుంభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు, సూర్యుడు మరియు బుధ గ్రహాల యొక్క శుభ ప్రభావాలు మీ జీవితంలో కనిపిస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. 


Also Read: Shani Uday 2023: త్వరలో ఉదయించనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook