Guru Gochar 2023: మరి కొన్ని గంటల్లో ఈ 4 రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
Gajkesari Rajyog: మరో 24 గంటల్లో చంద్రుడు, బృహస్పతి కలిసి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం వల్ల కొందరి తలరాత మారనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Guru Chandra Yuti 2023: గ్రహాలు తమ రాశులను మార్చడం ద్వారా శుభ యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని గంటల్లో అలాంటి ఓ యోగమే ఏర్పడనుంది. ఏప్రిల్ 17న చంద్రుడు మరియు బృహస్పతి కలిసి మీన రాశిలో గజకేసరి రాజయోగాన్ని చేస్తున్నాయి. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శక్తివంతంగా భావిస్తారు. గజకేసరి రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
మిధునరాశి
చంద్రుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన గజకేసరి రాజయోగం మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ రాజయోగం మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో ఏర్పడబోతోంది. దీంతో వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వృషభం
గజకేసరి రాజయోగం వల్ల వృషభ రాశి వారి అదృష్టం పట్టనుంది. అంతేకాకుండా మీ ఆదాయం డబల్ అవ్వనుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. విదేశాలు నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
Also read: Kedar Yogam 2023: 500 ఏళ్ల తరువాత అద్భుత సంయోగం, కేదారయోగం ప్రభావంతో ఊహించని ధనవర్షం
కన్య రాశి
కన్యా రాశి వారికి గజకేసరి యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మిమ్మల్ని విజయం వరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
కర్కాటక రాశి
గజకేసరి రాజయోగం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
Also Read: Mangal Gochar 2023: వచ్చే నెలలో చంద్రుని రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook