Jupiter And Venus Conjunction 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున అంటే మార్చి 07న హోలికా దహనం జరుపుకోనున్నారు. మార్చి 8న రంగుల హోలీ ఆడతారు. అయితే ఈ సంవత్సరం హోలీ నాడు ప్రత్యేక గ్రహ సంయోగం జరగనుంది. హోలీనాడు దేవతల గురువు బృహస్పతి మరియు రాక్షసుల గురువు శుక్రుడు మీనరాశిలో ఉంటారు. వీరి కూటమి మూడు రాశులవారికి అదృష్టాన్ని ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశిచక్రం
హోలీతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో గురు మరియు శుక్రుల కలయిక ఏర్పడుతోంది. దీంతో మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి  మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం, కెరీర్ లో పురోగతి ఉంటుంది. 


వృషభ రాశి
శుక్రుడు మరియు బృహస్పతి సంయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు హోలీ నుండి మంచి రోజులు మెుదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఆదాయం మరియు లాభ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతోంది. అందుకే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. పాతపెట్టుబడి ద్వారా మీకు లాభాలు వస్తాయి. ఏదైనా పని లేదా జాబ్ మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.


మేష రాశి
హోలీ నుండి మేషరాశి వారికి భారీగా డబ్బు వస్తుంది. కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీ జాతకంలో రెండో ఇంట్లో గురు మరియు శుక్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీడియా, ఫిల్మ్ లైన్ లేదా మార్కెటింగ్ రంగాలతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Rajyogam: 'లక్ష్మీనారాయణ యోగం' చేస్తున్న బుధుడు-శుక్రుడు.. ఈ రాశులపై కనకవర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.