Guru Chandal Yog 2023: ఈ రాశులవారికి బిగ్ రిలీఫ్..జీవితం మళ్లీ ఆనందకరం..
Guru Chandal Yog 2023: గురు చండాల యోగం తొలగిపోవడం వల్ల కొన్ని రాశులవారికి బిగ్ రిలీఫ్ లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి.
Guru Chandal Yog 2023: గురు చండాల యోగం కారణంగా ఏర్పడే దుష్ప్రభావాలు అందరికీ తెలిసింది. వ్యక్తుల జాతకాల్లో గురు చండాల యోగం ఏర్పడితే జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో పాటు కొంతమందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. బృహస్పతి, రాహువుల కలయిక వల్ల ఏర్పడే చండాల యోగం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో ఏర్పడిన చండాల యోగం అక్టోబర్ 30న తొలగిపోబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి బిగ్ రిలీఫ్ లభించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గురు చండాల యోగం తొలగిపోవడం వల్ల అక్టోబర్ 30 నుంచి సింహ రాశివారికి బిగ్ రిలీఫ్ లభించబోతోంది. వీరికి ఈ సమయంలో జీవితం ఆనందకరంగా మారుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు, విద్యాభ్యాసాలు కొనసాగిస్తున్నవారికి చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో చురుకుగా కూడా పని చేస్తారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఇక ఈ యోగం ముగింపు దశకు చెరుకోవడం వల్ల కర్కాటక రాశివారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వృత్తిలు కొనసాగిస్తున్నవారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో దూరమవుతాయి. వీరు ఆలోచించి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
గురు చండాల యోగం తొలగిపోవడం వల్ల తుల రాశివారికి కూడా ఎవతో లాభదాయకంగా ఉండబోతోంది. వివాహ కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా అక్టోబర్ 30 నుంచి మంచి రోజులు స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఉద్యోగాలు చేసేవారి విషయానికొస్తే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనులు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి