Jupiter Moon conjunction 2023: 12 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 22, 2023న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనుంది. మేషరాశిలో బృహస్పతి యొక్క సంచారం ఇతర గ్రహాలతో కలిసి చాలా శుభ యోగాలను సృష్టిస్తుంది. బృహస్పతి మేషరాశిలోకి వెళ్లినప్పుడు అప్పటికే చంద్రుడు అక్కడ కూర్చుని ఉంటాడు. మేషంలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని కారణంగా అరుదైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది 4 రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజలక్ష్మీ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి: గురు, చంద్రుల కలయికతో ఏర్పడిన గజలక్ష్మి యోగం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. 
మిథునం : గజలక్ష్మీ యోగం వల్ల మిథునరాశి వారి జీతం పెరుగుతుంది. మీకు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సమాజంలో  గౌరవాన్ని పొందుతారు. మీడియా, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారికి కలిసి వస్తుంది. 
ధనుస్సు: గజలక్ష్మి యోగం ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారుస్తులు భారీగా లాభపడతారు. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్ కుదర్చుకునే అవకాశం ఉంది. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. 
కుంభం: కుంభరాశి వారికి గురు, చంద్ర కలయిక వల్ల ఏర్పడే గజలక్ష్మి యోగం వల్ల లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు.  


Also Read: Mangal Gochar 2023: మార్చిలో మిథునరాశిలోకి మార్స్.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి