Jupiter Transit 2023 in Telugu: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురువు అని పిలుస్తారు. విజ్ఞానం, దాతృత్వం మరియు సంతానానికి కారకుడిగా గురుడిని భావిస్తారు. 27 రాశులలో పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద రాశులకు బృహస్పతి అధిపతి. ఇతడు ఏడాదికి ఒక రాశిని మారుస్తాడు. ఏప్రిల్ 22న మేషరాశిలోకి ప్రవేశించిన గురుడు.. మే 01, 2024 వరకు అదే రాశిలో ఉంటాడు. గురు గోచారం వల్ల రాబోయే 11 నెలలు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల రాశి- ఈ సమయంలో తులా రాశి వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు ఏదైనా భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


మీనం - మీన రాశి వారికి ఈ సమయం బాగుంటుంది. మీకు పూర్వీకుల స్థిర చరాస్థులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. 


మేషరాశి- ప్రస్తుతం ఇదే రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. ఇది మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.  


Also Read: Festivals in july 2023: జూలై నెలలో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?


సింహ రాశి- బృహస్పతి సంచారం సింహ రాశి వారికి వరం. వచ్చే సంవత్సరం వరకు వీరు మంచి లాభాలను పొందుతారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.


కన్యా రాశి- గురుడు రాశి మార్పు కన్యారాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వ్సతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు బోనస్ తోపాటు ఇంక్రిమెంట్ కూడా లభించవచ్చు. 


Also Read: Ketu transit 2023: చిత్రా నక్షత్రంలోకి కేతువు.. ఈ 5 రాశులకు సమస్యలు షురూ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook