Ketu Transit 2023: చిత్రా నక్షత్రంలోకి కేతువు.. ఈ 5 రాశులకు సమస్యలు షురూ!

Ketu Transit 2023: మరో రెండు రోజుల్లో కేతువు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. కేతువు నక్షత్ర మార్పు ఐదు రాశులవారికి కష్టాలను పెంచనుంది. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2023, 08:17 PM IST
Ketu Transit 2023: చిత్రా నక్షత్రంలోకి కేతువు.. ఈ 5 రాశులకు సమస్యలు షురూ!

Ketu will Transit 2023 in Chitra Nakshatra on 26th June 2023: దుష్ట గ్రహమైన కేతువు సంచారం ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా కేతువు ఎప్పుడు తిరోగమన దిశలో కదులుతూ ఉంటాడు. మరో రెండు రోజుల్లో అంటే జూన్ 26న కేతువు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కేతువు యెుక్క నక్షత్ర మార్పు ఐదు రాశులవారిని ఇబ్బందులు పెట్టనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
ఈ రాశి యెుక్క నాల్గవ ఇంట్లో కేతువు సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీ తల్లి గారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు వస్తాయి. అయితే క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. మీరు చాలా బిజీగా గడుపుతారు. 

మిధున రాశి
కేతు సంచారం వల్ల మీ పిల్లలు పుట్టటం కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. కేతువు ప్రేమికుల మధ్య గొడవలు తలెత్తేలా చేస్తాడు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరు. ఈ సమయంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవచ్చు. మెుత్తానికి మిథునరాశి వారి జీవితం కష్టాలమయం అవుతుంది. 

Also Read: Planet transit 2023: మరో ఆరు రోజుల తర్వాత ఈ 4 రాశులకు సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

కన్య రాశి
కేతువు యొక్క ఈ సంచారం కన్య రాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇతరుల మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫ్యామిలీలో విభేదాలు వస్తాయి. మీ సంపాదన తగ్గుతుంది. దీంతో మీరు పొదుపు చేయడం కష్టతరం అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కొంత మేర దిగజారే అవకాశం ఉంది. 

మకర రాశి
దుష్ట కేతువు వల్ల మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమవుతుంది. మీ కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కష్టాలే ఎదురవుతాయి. మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.  

మీన రాశి
మీ రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో కేతువు సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మీరు మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. 

Also Read: Astrology: రాబోయే 14 రోజులు ఈ 4 రాశుల వారిపై నోట్ల వర్షం.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News