2024 Astrological Prediction: న్యూ ఇయర్ దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది తమ ప్యూచర్ బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలో కొందరు ముందుగానే కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందోనని జ్యోతిష్యం చెప్పించుకుంటారు.  సాధారణంగా మీ ఫేట్ ను మీ జాతకంలోని గ్రహాలు మరియు రాశుల స్థానాలే నిర్ణయిస్తాయి. గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహం బృహస్పతి. అందుకే ఇతడి కదలిక చిన్న మార్పు వచ్చిన అది ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతోంది. డబ్బు బాగా సంపాదించాలన్నా, పెళ్లి అవ్వాలన్నా, విద్యాప్రాప్తి కలగాలన్నా గురుడు అనుగ్రహం ఉండాలి. ధనస్సు మరియు మీనరాశులకు అధిపతిగా బృహస్పతిని భావిస్తారు. గురు గ్రహం కటాక్షం వల్ల 2024లో నాలుగు రాశులవారి కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు(Sagittarius)
కొత్త సంవత్సరంలో బృహస్పతి ధనుస్సు యొక్క ఆరవ ఇంట్లో కూర్చుంటాడు. దీంతో ఈ రాశి వారికి త్వరలోనే ఉద్యోగం వస్తుంది. ఇన్నాళ్లు ఆగిపోయిన ప్రమోషన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ నిమిత్తం ట్రాన్సఫర్ అవ్వాలనుకునే వారికి ఇదే మంచి సమయం.
సింహం(Leo)
బృహస్పతి సంచారం వల్ల సింహరాశి వారి కెరీర్ 2024లో దూసుకుపోనుంది. వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. వీరికి లీడర్ షిప్ క్వాలిటీస్ మెండుగా ఉంటాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
కుంభం(Aquarius)
గురుడు దయ వల్ల వచ్చే ఏడాది కుంభం రాశి వారి కెరీర్ చాలా బాగుంటుంది. వీరు ఏది కోరుకున్న ఇట్టే జరిగిపోతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా మీ జీతం పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది. 


Also Read: Rasi Phalalu 2024: ఈ రాశులవారిపై ఆదిత్య మంగళ రాజయోగం ప్రభావం..అప్పటి నుంచే గోల్డెన్‌ డేస్‌ ప్రారంభం..


మేష రాశి(Aries)
వచ్చే ఏడాది బృహస్పతి మేషరాశి యెుక్క రెండవ ఇంట్లో సంచరించనుంది. దీని కారణంగా ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. నిరుద్యోగులకు కూడా జాబ్ లభిస్తుంది. మెుత్తంగా మేషరాశి వ్యక్తలు కెరీర్ నూతన సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతోంది.


Also Read: Rasi Phalalu: రాహు సంచారంతో ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతోంది.. ముట్టిందల్లా బంగారమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి