Guru Gochar 2023: రేర్ రాజయోగం చేస్తున్న బృహస్పతి.. ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..!
Guru Gochar 2023: దేవగురు బృహస్పతి ఏప్రిల్ నెలలో మేషరాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Guru Gochar 2023: దేవగురువు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 22, తెల్లవారుజామున 04.42 గంటలకు గ్రహం మీనం నుండి బయలుదేరి మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. అతడు అక్కడే మే 1 వరకు ఉంటాడు. జ్ఞానం, దానం, విద్య మరియు సంతానప్రాప్తికి కారకుడిగా దేవగురువును భావిస్తారు. మేషరాశిలో గురు గోచార ప్రభావం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. గురు గోచార ప్రభావం ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
గురు గోచార ప్రభావం ఈ రాశులకు వరం
మిధునరాశి
బృహస్పతి సంచారం వలన ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మిథునరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
తులారాశి
దేవగురువు బృహస్పతి సంచారం వల్ల తుల రాశి వారు లాభాలను పొందుతున్నారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు.
కర్కాటక రాశి
గురు సంచారం వల్ల తుల రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ దక్కుతుంది. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటారు.
కన్య రాశి
మేషరాశిలో బృహస్పతి సంచారం కన్యారాశి వారిపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో సుఖాలు కలుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మీనరాశి
గురు సంచారం వల్ల ఏర్పడే వ్యతిరేక రాజయోగం మీన రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఉద్యోగుల జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా దక్కుతుంది.
Also Read: Shukra Gochar 2023: మేషరాశిలో రాహు-శుక్రుల మైత్రి... ఈ 3 రాశుల వారు జాగ్రత్త సుమీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook