Shukra Gochar 2023: మేషరాశిలో రాహు-శుక్రుల మైత్రి... ఈ 3 రాశుల వారు జాగ్రత్త సుమీ..!

Shukra Gochar 2023: మేషరాశిలో రాహువు మరియు శుక్రుడు కలయిక ఏర్పడబోతుంది. దీని వల్ల ముఖ్యంగా 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 03:52 PM IST
Shukra Gochar 2023: మేషరాశిలో రాహు-శుక్రుల మైత్రి... ఈ 3 రాశుల వారు జాగ్రత్త సుమీ..!

Shukra Gochar 2023 in Mesh Effects: ఆస్ట్రాలజీలో రాహు గ్రహాన్ని ఛాయా గ్రహం, దుష్ట గ్రహం అని పిలుస్తారు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. రీసెంట్ గా శుక్రుడు మేషరాశిలో సంచరించాడు. దీని వల్ల మేషంలో రాహు-శుక్రల కలయిక ఏర్పడింది. వీరిద్దరి సంయోగం మూడు రాశులవారికి ప్రమాదకరంగా ఉంటుంది. వీరు ఏప్రిల్ 06 వరకు జాగ్రత్తగా ఉండాలి. అనంతరం శుక్రుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు-శుక్రల సంయోగం ఏయే రాశులవారికి ఇబ్బందులు తెస్తుందో తెలుసుకోండి.

రాహువు శుక్రుడు కలయిక ఈ రాశులకు హానికరం
మేషం: శుక్రుడు మరియు రాహువు కలయిక మేషరాశిలో జరగబోతుంది. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కష్టంగా నడుస్తోంది. 
కన్య: శుక్ర, రాహువుల కలయిక కన్యారాశి వారికి మంచిది కాదు. ఆరోగ్య సంబంధిత సమస్య తలెత్తవచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ దాంపత్య జీవితంలో గొడవలు రావచ్చు. 
కర్కాటక రాశి: శుక్ర, రాహువుల కలయిక కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూసే వారు వేచి ఉండాల్సి రావచ్చు. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశివారికి ఈ సమయం అస్సలు కలిసిరాదు. 

Also Read: Budh Gochar 2023: సూర్య-బుధుడి 'బుధాదిత్య యోగం'.. మీనరాశి వారికి అద్భుత ప్రయోజనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News