Guru Mahadasha: గురు మహాదశతో 16 ఏళ్ల వరకూ తిరుగుండదా, ఏం చేయాలి
Guru Mahadasha: జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం లేదా నక్షత్రం రాశి పరివర్తనానికి విశేప ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల గోచారంతో విభిన్న రాశుల జాతకాలపై ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అదే విధంగా గ్రహాల మహాదశ, అంతర్గశ కూడా ప్రభావం చూపిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన గ్రహాలు శని, గురు గ్రహాలు. గురు గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ ప్రభావం శక్తివంతమైంది. గురు మహాదశ అనేది 16 ఏళ్ల వరకూ ఉంటుందంటారు. ఎవరి జాతకం కుండలిలోనైనా శుభస్థితిలో ఉంటే..కొన్ని లాభాలున్నాయి. అదృష్టం తోడవుతుంది. పదవి, ప్రతిష్ఠ, ధనం, గౌరవ మర్యాదలు అన్నీ ప్రాప్తిస్తాయి.
ప్రభావం
గురు మహాదశ ఎప్పుడున్నా ఆ జాతకుల జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ క్రమంలో ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. ఈ సందర్బంగా నెగెటివ్ ఆలోచన దూరం చేసుకోవాలి. జీవితంలో పాజిటివిటీ ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవాళ్లు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు.
శుభ స్థితి
జ్యోతిష్యం ప్రకారం ఎవరి కుండలిలో గురువు శుభస్థితిలో ఉంటే వారిపట్ల గురుడు ఆకర్షితుడౌతాడు. ఈ జాతకులు శాంత స్వభావులే కాకుండా విజ్ఞానవంతులు. ఉన్నత చదువులు చదువుతారు. కెరీర్‌పరంగా ఈ జాతకులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జీవితంలో ధననష్టం ఎప్పటికీ ఉండదు.
అశుభ స్థితి
ఎవరి కుండలిలోనైనా గురువు అశుభ స్థితిలో ఉంటే ఆ జాతకుల జీవితంలో కష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. దాంపత్య జీవితంలో గొడవలు రావచ్చు. కెరీర్‌లో చాలా సంఘర్షణ చవిచూడాల్సి వస్తుంది. సంతాన సుఖం లభించదు. ఆరోగ్యం పాడవుతుంది.
ఉపాయాలు
కుండలిలో దేవగురువైన గురుడు బలహీనంగా లేదా అశుభ స్థితిలో ఉంటే ఆ జాతకులు గురువారం నాడు వ్రతం ఆచరించాలి. ఈ రోజున పసుపు మిఠాయి లేదా శెనగ పిండి, పసుపుతో తయారైనా ఏదైనా పదార్ధం తీసుకోవడం శుభసూచకమౌతుంది. నీళ్లలో పసుపు కలుపుకుని స్నానం చేసి విష్ణు భగవానుడిని పూజించాలి. గురువారం నాడు అరటి చెట్టుకు పూజలు చేయాలి. పసుపు, బెల్లం, శెనగపప్పు సమర్పించాలి. గురువారం నాడు శెనగపప్పు, అరటి, పసుపు మిఠాయి దానం చేయడం వల్ల గురువు స్థితి పటిష్టంగా ఉంటుంది.
Also read: Mars Transit 2023: సరిగ్గా 4 రోజుల తరువాత ఈ 4 రాశులకు భయంకర కష్టాలు తప్పవా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook