Guru Planet Margi 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని సంచారం మెుత్తం మానవాళిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో కొందరి అదృష్టం ప్రకాశిస్తే, మరికొందరు భారీ నష్టాలను చవిచూస్తారు. ఆస్ట్రాలజీలో బృహస్పతిని (Jupiter Planet) శుభగ్రహంగా భావిస్తారు. దేవతల గురువైన బృహస్పతి నవంబరు 24న ప్రత్యక్ష సంచారంలోకి రాబోతున్నాడు. గురుడు మార్గంలో ఉండటం వల్ల పంచ మహాపురుష యోగం (Pancha Mahapurusha RajYoga) ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు.  ముఖ్యంగా వీరు కెరీర్ లో పురోగతిని, అపారమైన ధనాన్ని పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదృష్ట రాశులు ఇవే..
కర్కాటకం (Cancer): బృహస్పతి మార్గంలో ఉండటం వల్ల ఈరాశివారికి మేలు జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేయవచ్చు, దీని వల్ల మీకు లాభం చేకూరుతుంది. విదేశాల్లో బిజినెస్ చేసే వారు భారీ లాభాలను గడిస్తారు. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారు విజయం  సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. 


మిథునం (Gemini): ఈ రాశి వారికి గురుగ్రహ మార్గం కారణంగా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటికే పనిచేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంక్రిమెంట్ లేదా బోనస్ కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తారు. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.  ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. 


వృషభం (Taurus): బృహస్పతి మార్గం వల్ల మళ్లీ ఈ రాశి వారికి మంచి రోజులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మీరు ఏదైనా ఆస్తిని లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. పరిశోధన, బోధనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగులకు కూడా మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: Shukra Gochar 2022: తులరాశిలో శుక్ర సంచారం... ఈ రాశులవారికి ఆదాయం పెరగడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook