Guru Margi November 2022: బృహస్పతి గ్రహానికి దేవగురు హోదా ఉందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ గ్రహాన్ని శుభ యోగంగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని అదృష్టంగా కూడా భావిస్తారు. అయితే ఈ నెల బృహస్పతి గ్రహం మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ తిరోగమనం 24 నవంబర్ 2022 జరనుంది కాబట్టి దీని ప్రభావం 12 రాశువారిపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని ప్రభావం పలు రాశులపై తీవ్రంగా పడే ఛాన్స్ ఉందని ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ రాశువారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం:


మేషం:
మేష రాశి వారికి గురువు మార్గి వల్ల అనుకూల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టెన్షన్ పెరిగి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారాల పరంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ క్రమంలో తిరోగమనాన్ని దృష్టిలో ఉంచుకుని పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


వృషభం:
గురువు మార్గి వల్ల వృషభ రాశి వారి జీవితాల్లో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. తిరోగమనం వల్ల ఈ రాశి వారికి తీవ్ర నష్టలు కలిగే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో జీవితంలో ఆనందం కలుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు.  


మిథునరాశి:
బృహస్పతి ప్రత్యక్ష సంచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మనసులో నిరుత్సాహం, అసంతృప్తి ఉంటుంది. చాలా రన్నింగ్ ఉంటుంది, ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. వ్యాపారంలో సమస్య ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితికి ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


కర్కాటకం:
కర్కాటక రాశి వారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. వీరికి ఈ క్రమంలో అదృష్టం వరిస్తుంది. ఉద్యోగ రంగంలో కోరుకున్న చోటికి బదిలీ జరుగుతాయి. అంతేకాకుండా మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి.


సింహ రాశి:
సింహ రాశి వారికి మాటల వల్ల ప్రయోజనం ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ రాశివారికి గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటారని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.


Also Read: Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?


Also Read: Sad Year For Mahesh: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook