Guru Purnima Significance: గురువులను శిష్యుడు గౌరవించుకునే  రోజే గురుపూర్ణిమ (Guru Purnima 2022). మహాభారత గ్రంథ రచయిత, అష్టాదశ పురాణాల సృష్టికర్త అయిన వ్యాసుడి పుట్టినరోజునే గురు పూర్తిమగా జరుపుకుంటారు. ఈ రోజున శిష్యులు తమకు తోచిన విధంగా గురువుగారిని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ సారి గురు పూర్ణిమ 13 జూలై 2022, బుధవారం నాడు వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురుపూర్ణిమ నాడే 4 రాజయోగాలు 
యాదృచ్ఛికంగా గురుపూర్ణిమ నాడే 4 రాజయోగాలు (raj yoga) ఏర్పడుతున్నాయి. ఈ రోజున రుచక్, భద్ర, హన్స్ మరియు షష్ అనే 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా మిథునరాశిలో సూర్యుడు-బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా సంవత్సరాల తర్వాత బుధాదిత్య యోగంలో గురు పూర్ణిమ వచ్చింది.  అలాంటి యాదృచ్ఛికాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా శుభప్రదంగా భావిస్తారు. 


గురు పూర్ణిమ రోజున చర్యలు తీసుకోండి
గురు పూర్ణిమ రోజున ఏర్పడే ఈ యోగాలలో పూజలు చేస్తే.. మీ పుణ్య ఫలం రెట్టింపు అవుతుంది. గురువు గారి ఆశీస్సులు పొందడానికి, జాతకంలో గురు గ్రహ స్థానం బలపడటానికి ఈ రోజున పూజలు చేయండి. మీ పనుల్లో ఆటంకాల్లో ఏర్పడుతున్నా, పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నా, అలాంటి వారు గురు పూర్ణిమ రోజున బృహస్పతి గ్రహాన్ని పూజించండి. త్వరలోనే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 


Also Read; Hariyali Amavasya 2022: హరియాళీ అమావాస్య ఎప్పుడు? ఈ రోజున చెట్లను ఎందుకు నాటుతారు? 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook