Guru Rahu Yuti makes Guru Chandal Rajyog: గ్రహాల కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశిచక్రాల ప్రజలపై కనిపిస్తుంది. ప్రస్తుతం దేవతల గురువుగా పిలువబడే బృహస్పతి, చండాలుడిగా పరిగణించేబడే రాహువు మేషరాశిలో కలిసి ఉన్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది అక్టోబరు 30 వరకు కొనసాగుతుంది. ఎందుకంటే అక్టోబరు 30న ఛాయాగ్రహమైన రాహువు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మాత్రమే ప్రజలు ఈ అశుభ యోగం నుండి విముక్తి పొందగలరు. అయితే గురు చండాల యోగం కారణంగా మూడు రాశులవారు చాలా ఇబ్బందులు పడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
గురు చండాల యోగం ధనస్సు రాశివారికి అశుభమనే చెప్పాలి. ఎందుకంటే వీరి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీది లేదా మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో భగవంతుని స్మరించడం మరియు పక్షులకు ఆహారం ఇవ్వడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Vipreet Raj Yoga: అరుదైన యోగం చేస్తున్న బృహస్పతి... ఈ 2 రాశులపై డబ్బు వర్షం..


మిధునరాశి
ఈ రాశి వారికి గురు చండాల రాజ్యయోగం నష్టాలను ఇస్తుంది. కోర్టు కేసులు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కోరిక నెరవేరదు.  కెరీర్‌తో పాటు వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో భారీగా నష్టాలను చవిచూస్తారు. మీ మాటలను అదుపులో పెట్టుకోండి.


మేషరాశి
ఇదే రాశిలో గురు చండాలయోగం ఏర్పడింది. దీంతో మేషరాశి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. వ్యాపార మరియు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ రావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఆలోచించండి. 


Also Read: Weekly Horoscope: ఈ వారం అదృష్ట రాశులు ఇవే.. వీరికి ఊహించనతం డబ్బు, జాబ్ ప్రమోషన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook