Guru Rashi Parivartan 2023: బృహస్పతి గ్రహాన్ని వేద జ్యోతిషశాస్త్రంలో ఆనందం, శ్రేయస్సు, సంపద, అదృష్టానికి సంకేతాలుగా భావిస్తారు. అయితే బృహస్పతి గ్రహంలో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ గ్రహం ఇప్పుడు శుభ స్నానంలో సింహాసనాన్ని అధిష్టించబోతోంది. దీని కారణంగా చాలా రాశుల్లో మార్పులు సంభవించబోతున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల జీవితంలో కూడా మార్పులు సంభవించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2023 కొత్త సంవత్సరంలో బృహస్పతి సంచారము ఐదు రాశులపై ప్రభావం పడనుంది. దీంతో పలు రాశులకు ప్రయోజనాలు కలుగుతే మరి కొన్ని రాశువారికి నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారిపై ప్రభావం:
మేషరాశి:

మేష రాశి వారికి బృహస్పతి సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పూర్వం ఆగిపోయిన పనులన్నీ నెరవవేరే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు సులభంగా విజయాలు సాధించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వ్యాపారాల్లో ఈ సంచారం వల్ల ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి.


మిథునం:
మిధున రాశి వారికి ఈ సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ధన లాభంతో పాటు పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ క్రమంతో విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.


కర్కాటకం:
కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం ప్రయోజనకరంగా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. 2023లో బృహస్పతి సంచార ప్రభావంతో కెరీర్‌లో కొత్త అవకాశాలను పొందుతారు. ప్రమోషన్‌తో పాటు ఆదాయం, వ్యాయాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి.


కన్య:
బృహస్పతి గ్రహం రాశి మారడం వల్ల కన్య రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సంతోషాలతో పాటు ఆనందం పొందే ఛాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అంతేకాకుండా వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి.


తుల రాశి:
తులారాశి వారికి బృహస్పతి మార్పు వల్ల జీవితంలో సంతోషాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న పనులు నెరవేరుతాయి. వ్యాపారాల పరంగా ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read : Ginna OTT Streaming: మంచు విష్ణు జిన్నా ఓటీటీ స్ట్రీమింగ్ రేపట్నించే, ఎందులోనంటే


Also Read : Adivi Sesh HIT 2: అన్నీ అనుమానాలే.. అందుకే ఇలా ఉన్నా.. అడివి శేష్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook