Adivi Sesh Doubt on HIT 2 Script : నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ఫస్ట్ కేస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ నటన అందరినీ మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ కేస్ అంటూ అడివి శేష్‌ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు నిర్మాత నాని, డైరెక్టర్ శైలేష్ కొలను. అయితే స్వతాహాగా రచయిత కావడంతో అడివి శేష్‌కు కథల మీద పట్టుంటుంది. తాను కథలు వినేప్పుడు ఓ ఆడియెన్‌లా వింటానని, బోర్ కొడితే.. బోర్ కొడుతోందని, మార్చమని చెబుతానంటూ అడివి శేష్ అన్నాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాల మీద స్పందించాడు.
హిట్ ఫస్ట్ కేస్ హిట్ అయింది.. ఈ కథతో శైలేష్ కొలను నా దగ్గరకు వచ్చాడు.. నానియే నన్ను రిఫెర్ చేశాడు.. విశ్వక్ సేన్ చేసిన సినిమా.. మళ్లీ నేను చేయడం ఎందుకు.. అతని అవకాశాన్ని లాక్కున్నట్టుగా అవుతుంది కదా? అని నాకు అనిపించింది.. ఇదే విషయాన్ని శైలేష్ కొలనుకు చెప్పాను.. ఇది వేరే కథ.. మల్టీ యూనివర్స్‌గా సినిమాను తీయాలని అనుకుంటున్నాను అని శైలేష్ చెప్పాడు. మరి ఇదే విషయాన్ని విశ్వక్ సేన్‌కు కూడా చెప్పావా? అని అడిగాను. హా చెప్పాను అని శైలేష్ అన్నాడు. అయితే నేను కథ వింటాను అని అప్పుడు ఓకే చెప్పాను అంటూ నాటి విషయాలను అడివి శేష్ బయటపెట్టేశాడు.
అయితే అడివి శేష్ మాత్రం ప్రతీ సారి డౌట్స్‌ను వ్యక్తం చేస్తూనే ఉన్నాడని, కథ చాలా సేపు నెరేట్ చేశానని, ఐదారు సిట్టింగ్స్ అయ్యానని శైలేష్ కొలను చెప్పాడు. ఇదే విషయాన్ని అడివి శేష్ ముందు ఉంచితే.. ఇలా అన్నాడు. నాకు చాలా అనుమానాలు వస్తూనే ఉంటాయి.. మామూలుగానే నా జీవితంలోనే అన్నీ అనుమానాలు ఉంటాయి.. నేను ప్రతీది అనుమానంతోనే ఉంటాను.. చూస్తాను.. కథలో అయితే ఇంకా ఎక్కువ అనుమానాలు వస్తుంటాయి.. అందుకే నేను ఎక్కువగా డౌట్స్ అడుగుతుంటాను.. అవి సరైన డౌట్సే.. అందుకే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. అంటే నావి సరైన డౌట్సే కదా? అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు.
Also Read : Poonam Kaur fibromyalgia : పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. ఇంతగా బాధపడుతోందా?.. అసలేం జరిగిందంటే?
Also Read : Mahesh Babu Son Gautam : అమ్మ బాబోయ్ గౌతమ్‌లో ఈ టాలెంట్ ఉందా?.. స్కూల్‌లో స్టేజ్ మీద మహేష్ బాబు తనయుడి నటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook