Shubh Yog: `మాలవ్య-హంస రాజయోగం`.. ఈ రాశులకు వద్దన్నా డబ్బు, అదృష్టం..
Shubh Yog In Kundali: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురుడు మరియు శుక్రుడి కలయిక శుభ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది కొన్ని రాశులవారికి ప్రయోజనాలు ఇవ్వబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Hans-Malavya Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం వల్ల అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి మరియు రాక్షసల గురువు శుక్రుడు మీన రాశిలో ఒకేరాశిలో సంచరిస్తున్నారు. ప్రేమ, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు ఐశ్వర్యానికి శుక్రుడు కారకుడి కాగా.. జ్ఞానం, సంపద మరియు అభివృద్ధికి కారకుడిగా బృహస్పతిని భావిస్తారు. మీనరాశిలో గురు మరియు శుక్రుల కలయిక 12 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా హన్స్ మరియు మాళవ్య రాజయోగాలు ఏర్పడతాయి. దీంతో కొన్ని రాశుల అదృష్టం ప్రకాశించనుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి హన్స్ మరియు మాళవ్య రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. దీంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. ఈ సమయం విద్యార్థులకు మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ గ్రహాల సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కుతుంది. దీర్ఘకాలంగా ఉన్న చింతలు తొలగిపోతాయి. గురు, శుక్రల ప్రత్యేక కలయిక మీకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.
మీనరాశి
ఈ రాశిలోనే గురు మరియు శుక్రుల కలయిక ఏర్పడింది. దీని కారణంగా ఏర్పడిన రాజయోగాలు మీలో ధైర్యాన్ని, శక్తిని పెంచుతాయి. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తంది. విదేశీ వ్యాపారం చేసే వారు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Sun Transit 2023: మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశం... ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook