Niyati Palat Rajyog benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి. ప్రస్తుతం శనిదేవుడు కుంభంలోనూ, గురుడు తన సొంత రాశి అయిన మీనరాశిలోనూ,  శుక్రుడు మీనరాశిలోనూ, అంగారకుడి వృషభరాశిలోనూ సంచరిస్తున్నారు. దీని వల్ల హన్స్ మరియు మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగాల నుండి అరుదైన నియతి పాలత్ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారికి కాలం కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం
నియతి పాలత్ రాజయోగం వల్ల కర్కాటక రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంది మరియు బృహస్పతి తన సొంత రాశిలో కూర్చున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ఆధ్యాత్మిక లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 
వృశ్చిక రాశిచక్రం
మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ కూటమి మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. సంపదకు అధిపతి అయిన బృహస్పతి మీ రాశి నుండి ఐదవ ఇంట్లో కూర్చుంటాడు. దీంతో మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఉన్నత విద్యాసంస్థలో మీకు ఆడ్మిషన్ దక్కుతుంది. 
మిథున రాశిచక్రం
ఈ సమయం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు బాగుంటుంది.. ఎందుకంటే మీ సంచార జాతకంలో దశమ స్థానంలో హన్స్ మరియు మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో శనిదేవుడు మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాడు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభపడతారు. శుక్ర గ్రహం ప్రభావం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.


Also Read: Astrology: ఏప్రిల్ లో ఎప్పుడూ చూడని గ్రహాల కలయిక... వీరు ఏ పని చేపట్టినా విజయమే ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.