Astrology: ఏప్రిల్ లో ఎప్పుడూ చూడని గ్రహాల కలయిక... వీరు ఏ పని చేపట్టినా విజయమే ఇక..

Astrology: వేద పంచాంగం ప్రకారం, 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 01:38 PM IST
Astrology: ఏప్రిల్ లో ఎప్పుడూ చూడని గ్రహాల కలయిక... వీరు ఏ పని చేపట్టినా విజయమే ఇక..

Sun And Jupiter Conjunction In Aries 2023: వేద జ్యోతిషశాస్త్రంలో, గ్రహాలు ఒకదానికొకటి స్నేహం మరియు శత్రుత్వం కలిగి ఉంటాయి. గ్రహాల కలయిక ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఏప్రిల్‌లో బృహస్పతి మరియు సూర్యుని కలయిక జరగబోతుంది. 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో వీరిద్దరి సంయోగం జరుగుతుంది. దీంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బృహస్పతి-సూర్యుడి కలయిక ఈ రాశులకు వరమే ఇక..
మేషం
బృహస్పతి మరియు సూర్యుని కలయిక మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే మీ ఆరోహణ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతుంది.  దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. పెళ్లికానివ వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. 
మిథునం
మేషంలో బృహస్పతి మరియు సూర్యుని సంయోగం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలోని ఆదాయ గృహంలో వీరి కలయిక జరుగుతుంది. దీంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. పాతపెట్టులు లాభిస్తాయి. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకుంటారు. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం.
కర్కాటకం
దేవగురు మరియు గ్రహాల రాజు కలయిక కర్కాటక రాశివారికి వరమనే చెప్పాలి. ఎందుకంటే మీ కర్మ స్థానంలో వీరి కలయిక జరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి దక్కుతుంది. ఆఫీసులో మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. ఈరాశికి అధిపతి చంద్రుడు. ఇతడితో వారిద్దరికీ మంచి సంబంధాలే ఉన్నాయి. దాని కారణంగా కర్కాటక రాశివారు భారీగా ప్రయోజనాలు పొందుతారు. 

Also Read: Shukra Gochar 2023: త్వరలో మేషరాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశుల కెరీర్ సూపరో సూపరూ.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News