Guru Shukra yuti 2023: మరో రెండు రోజుల్లో రంగుల కేళీ అయిన హోలీ రాబోతుంది. మార్చి 08న ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఇదే రోజున దేవగురు బృహస్పతి, రాక్షస గురు శుక్రాచార్యుడు మీనరాశిలో ఉంటారు. దీని కారణంగా ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. ఇలా జరగడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ శుభయోగం కారణంగా హోలీ నాడు కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశి : హోలీ తర్వాత ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి. మీకు పెళ్లికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు మునుపటి కంటే ఆర్థికంగా మెరుగుపడతారు. 
మేష రాశి : మీ రాశి యెుక్క జాతకంలో రెండవ ఇంట్లో గురు మరియు శుక్రుల కలయిక జరగబోతుంది. దీంతో మీకు అనుకోకుండా డబ్బు వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ మాటతీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. 
వృశ్చిక రాశి : హోలీతో వృశ్చికరాశివారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో గురు మరియు శుక్రుల సంయోగం ఏర్పడుతోంది. దీంతో మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు ఈ సమయంలో ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు వృత్తి, వ్యాపారాల్లో లబ్ది పొందుతారు. 
వృషభ రాశి : శుక్రుడు మరియు బృహస్పతి కలయిక మీకు చాలా మేలు చేస్తుంది. హోలీ నుండి మీకు గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. అంతేకాకుండా మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Shukra Gochar 2023: మేషరాశిలో శుక్రుడి గోచారం.. ఈ రాశులపై డబ్బు వర్షం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook