Guru Transit 1 May 2024 In Telugu: గురువు బృహస్పతి దాదాపు ఒక సంవత్సరం తర్వాత రాశి సంచారం చేశాడు. శుక్రుడి సొంత రాశి అయిన వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇలా సంచారం చేయడం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి గ్రహం 2023 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇదిలా ఉండగా మళ్లీ ఈ గ్రహం మే 1వ తేదిన వృషభ రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కుబేర యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఈ లాభాలు 2025 సంవత్సరం వరకు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ గురు గ్రహ సంచారం కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి 2025 సంవత్సరం వరకు లాభాలే లాభాలు:
సింహ రాశి:

వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా సింహ రాశివారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి కుబేర యోగం కారణంగా ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక లాభాలు పొందుతారు. అలాగే పెద్దపెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.


కన్య రాశి:
వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేయడం వల్ల కన్యా రాశివారికి కూడా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏర్పడే కుబేరు యోగం కన్యా రాశి వారికి అనేక ఆర్థిక లాభాలను అందిస్తుంది. దీంతో పాటు ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా ప్రమోషన్స్‌ లభిస్తాయి. అలాగే వీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక  ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం వీరికి శ్రేయస్సు కరంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. దీంతో పాటు వీరికి కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి