Guru Uday 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం ఉదయించినప్పుడు లేదా అస్తమించినప్పుడల్లా.. దాని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఈ గ్రహాల రైజింగ్ కారణంగా కొన్ని శుభ యోగాలు కూడా ఏర్పడతాయి. ఏప్రిల్ ప్రారంభంలో బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన హన్స్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో  తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హన్స్ రాజయోగం ఈ రాశులకు వరం
మీన రాశిచక్రం (Pisces)
హన్స్ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ లగ్న గృహంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు మీ లైఫ్ పార్టనర్ అన్ని విషయాల్లోనూ తోడుగా నిలుస్తారు. బృహస్పతి ఉదయించడం వల్ల వ్యాపారులకు మంచి ధనప్రాప్తి కలుగుతుంది. మీనరాశి వారిపై శని సడే సతి ప్రారంభమైంది. దీని వల్ల మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 


ధనుస్సు రాశిచక్రం (Sagittarius)
హన్స్ రాజయోగం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఉదయిస్తాడు. దీంతో మీకు అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. వ్యాపారుల రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. డబ్బును ఆదా చేస్తారు. మీకు పెట్టుబడులు లాభించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


కర్కాటక రాశిచక్రం (Cancer)
హన్స్ రాజయోగం మీకు వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయాన్ని ఇస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఉదయిస్తాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయం విద్యార్థులకు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 


Also Read: Shani Gochar 2023: గోల్డెన్ లెగ్స్ పై నడుస్తున్న శనిదేవుడు... ఈ రాశులకు అంతులేని మనీ.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook