Hanuman Janmotsav 2023: ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి (Hanuman Jayanti) రెండు  సార్లు వస్తుంది. అయితే తెలంగాణాలు మొదట వచ్చే హనుమాన్‌ జయంతిని చిన్న జయంతి అంటే, దీని తర్వాత వచ్చే జయంతి మాత్రం పెద్ద జయంతి అని అంటారు.  ఏప్రిల్ 6న మొదటి హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటారు. రెండవ జయంతిని కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. అయితే ఇదే క్రమంలో గురు, శుక్ర గ్రహాలు కలవడంతో మహాలక్ష్మి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  మహాలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హనుమాన్ జయంతి కారణంగా ప్రయోజనాలను పొందబోతున్న రాశులు ఇవే:
వృషభం:

మహాలక్ష్మి యోగం వల్ల వృషభ రాశి వారికి అపారమైన లాభాలు కలుగుతాయి. ఈ యోగం వల్ల ఆర్థిక పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా  కొత్త ఆదాయ వనరుల వల్ల వీరు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం గురించి ఆందోళన చెందేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. సులభంగా ఉద్యోగాలు పొంది, ప్రమోషన్స్‌ కూడా లభించే అవకాశాలున్నాయి.


కన్య రాశి:
కన్య రాశి వారికి మహాలక్ష్మి యోగం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ క్రమంలో కన్య రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా ఆదాయం పొందుతారు. అంతేకాకుండా అదృష్టం పొందడమేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.


మకర రాశి:
మకర రాశి వారిపై కూడా మహాలక్ష్మి యోగం ప్రభావం పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపార రంగానికి సంబంధించిన వారు ఈ క్రమంలో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నవారికి ఈ క్రమంలో మంచి ఫలితం కలగబోతోంది.


కుంభ రాశి:
కుంభ రాశి వారికి మహాలక్ష్మి యోగం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో పాత రుణాల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలు కూడా ఉండడం వల్ల డబ్బుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో కుంభ రాశివారు ఎలాంటి కోరికలు కోరుకున్న సులభంగా నెరవేరుతాయి.


Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?


Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook