Hanuman Jayanti 2022: హిందూ క్యాలెండర్‌లో మొదటి నెల చైత్ర మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నెలతోనే హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదే మాసంలో చైత్ర నవరాత్రి జరుగుతుంది. శ్రీరాముని జన్మదినమైన రామ నవమిని ప్రజలు జరుపుకుంటారు. ఇక ఇదే మాసంలో శ్రీరాముని భక్తుడైన హనుమంతుని పుట్టిన రోజు కూడా రావడం విశేషం. ఛైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నాడు హనుమంతుడు జన్మించాడు. ఈ సంవత్సరం, హనుమాన్ జయంతి ఏప్రిల్ 16న వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మాసంలో రాశి మారుతున్న శని, రాహు-కేతు :


జ్యోతిష్య పరంగా ఏప్రిల్ నెలలో పెద్ద మార్పులు సంభవించనున్నాయి. ఈ నెలలో ఏప్రిల్ 12న శని, రాహు-కేతువుల రాశిచక్రంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే కొన్ని ముందస్తు చర్యలు తప్పనిసరి. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఈ చర్యలు చేపడితే మంచి ఫలితాలు పొందుతారు. 


ఇలా చేస్తే మంచి ఫలితాలు :


హనుమాన్ జయంతి నాడు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమంతుని ఆలయానికి వెళ్లి హనుమాన్ విగ్రహం ముందు కూర్చుని పారాయణం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల శని దోషంతో ఇతరత్రా దోషాలు తొలగిపోతాయి.


హనుమంతుడికి బేసన్ లడ్డు చాలా ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ లడ్డును  నైవేద్యంగా సమర్పిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మల్లెపూల దండను హనుమాన్ విగ్రహానికి వేయాలి. హనుమాన్ జయంతి నుంచి.. వచ్చే 11 పౌర్ణమి వరకు ఇలా చేస్తే ఎంత పెద్ద కష్టం నుంచైనా బయటపడుతారు.


హనుమాన్ ఆలయంలో త్రిభుజాకారంలో ఉండే కాషాయ జెండాను ఉంచండి. ఇలా చేయడం వలన మీరు చేపట్టే అన్ని పనుల్లో శుభం కలుగుతుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయగలరు.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: AP Cabinet 2.0: ఏపీ కొత్త కేబినెట్.. 25 మందితో జాబితా రెడీ... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?


Also Read: Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' పోస్ట‌ర్‌ వచ్చేసింది.. పవన్‌ కళ్యాణ్ న్యూ లుక్‌ చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook