AP Cabinet 2.0: ఏపీ కొత్త కేబినెట్.. 25 మందితో జాబితా రెడీ... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Ministers in AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్‌లో మంత్రుల జాబితా ఖరారైంది. ఇవాళ (ఏప్రిల్ 10) సాయంత్రం 7గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా ఫైల్ చేరనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 05:30 PM IST
  • ఏపీ కొత్త కేబినెట్‌ మంత్రుల జాబితా రెడీ
  • 25 మందితో జగన్ కొత్త టీమ్
  • ఈ సాయంత్రం రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా
AP Cabinet 2.0: ఏపీ కొత్త కేబినెట్.. 25 మందితో జాబితా రెడీ... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Ministers in AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్‌లో మంత్రుల జాబితా ఖరారైంది. ఇవాళ (ఏప్రిల్ 10) సాయంత్రం 7గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా ఫైల్ చేరనుంది. పాత కేబినెట్‌లోని 10 మందిని కొత్త కేబినెట్‌లోనూ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రి పదవులు పొందే నేతలకు ఇప్పటికే సమాచారం అందడంతో ఆయా నేతల ఇళ్ల వద్ద కోలాహలం నెలకొంది. మొత్తం 25 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువదీరనుంది. తాజా కేబినెట్‌లో 56 శాతం బెర్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలకే కేటాయించినట్లు తెలుస్తోంది. కేబినెట్ కూర్పులో సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

ఏపీ కొత్త కేబినెట్‌లో మంత్రులు వీరే...?

ఏపీ కొత్త కేబినెట్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి  నాని, గుమ్మనూరు జయరాం, వేణు గోపాలకృష్ణ, కాకాని గోవర్దన్ రెడ్డి, విడదల రజనీ, జోగి రమేష్‌, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, సీదిరి అప్పలరాజు, కొండేటి చిట్టిబాబు తదితరులకు బెర్తులు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల జాబితా ఈ సాయంత్రం రాజ్‌భవన్‌కు చేరనుండటంతో కొత్త కేబినెట్‌పై అప్పటిదాకా సస్పెన్స్ తప్పేలా లేదు.

పిన్నెల్లి అనుచరుల ఆందోళన :

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. పిన్నెల్లికి మంత్రి పదవి కట్టబెట్టకపోతే తాము రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. కొత్త కేబినెట్‌లో బెర్త్‌పై పిన్నెల్లి చాలానే ఆశలు పెట్టుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, తొలి నుంచి వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న పిన్నెల్లి తనకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ బయటకొచ్చిన లీకుల్లో ఎక్కడా ఆయన పేరు వినిపించలేదు. దీంతో పిన్నెల్లికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అని ఆయన అనుచరులు టెన్షన్ పడుతున్నారు.

Also Read: RRR @1000 Crores: రూ. 1000 కోట్ల క్లబ్ దాటిన ఆర్ఆర్ఆర్.. తొక్కుకుంటూ పోతున్న తెలుగు సినిమా 

Also Read: Ghani Movie Review: గని మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News