Happy Bhogi 2023: భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? పక్క మీరు తెలుసుకోవాల్సిందే..
Happy Bhogi 2023: మన దేశంలో కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతికి చాలా ప్రముఖ్యత ఉంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ పండగ రోజున దాన కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.
Happy Bhogi 2023: భారతదేశం అన్ని మతాల సమ్మేళనం.. ప్రతి ఒక పండగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. అంతేకాకుండా మన దేశంలో అన్ని మతాల పండుగలు ఎంతో ఉత్సాహంగా జరుగుతాయి. ఇక్కడ ప్రకృతికి, ఆధ్యాత్మికతకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మన పండుగలు గ్రహాలు, రాశులు, పంటలు, రుతువులతో ముడిపడి ఉంటాయి. అయితే ఇలాంటి పండగల్లో మకర సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతిని భారతదేశం అంతటా వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ పండగను ' ఖిచ్డీ ' అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోనైతే ' పొంగల్ ' అని పిలుస్తారు. అన్ని రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. సంక్రాంతి ముందు మొదటి రోజు జరుపుకునే పండగను ' భోగి ' అంటారు. ఆచారాల ప్రకారం.. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే భూదేవి పక్షంలో పుట్టడం వల్ల ఆమెను ' భోగి ' అని పేరు పెట్టారని పేర్కొన్నారు.
భోగి ప్రముఖ్యత:
భోగిని వివిధ ప్రాంతాల వారు భిన్ననంగా నమ్ముతారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పేదరికానికి చిహ్నాలుగా భావించి వాటిని అన్నింటినికి భోగి మంటలో వేస్తారు. అవి మండినప్పుడు మనకు కనిపించే కాంతి జీవితంలో వెలుగునిస్తుందని పూర్వీకుల నమ్మకం. అంతేకాకుండా ఆ వెలుగు వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని కూడా కొందరు నమ్ముతారు. అయితే ఇంకొందరి అభిప్రాయం ప్రకారం.. రైతులు పండించిన కొత్త పంటలు చేతికి వచ్చిన రోజే భోగి పండగ జరుపుకుంటారని నమ్ముతారు.
అయితే రైతులు వారి కొత్త పంటలను ఇంటి తీసుకువచ్చినప్పుడు రైతుల ఆనందాన్ని జంతువులు, పక్షులు కూడా పంచుకుంటాయని రైతులు నమ్మకం. అంతేకాకుండా కొందరు తెలిసిన రైతులు పంటలను ఇంటికి తీసుకువచ్చే క్రమంలో జంతువుల కోసం పొలాల్లో కొన్ని గింజలను అక్కడే వదిలేసి వస్తారు. ఇలా చేయడం వల్ల జీవితాల్లో ఎలాంటి నష్టాలు జరగవని, అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందుతారని పురాణాల్లో పేర్కొన్నారు.
భోగి మంట ఆచారం:
ఈ పండుగ తెల్లవారు జామున భోగి మంట వేయడం దక్షిణ భారతీయుల ఆచారం. అయితే ఈ భోగి మంటలు వేసే క్రమంలో చాలా మంది ఇంటి బయట చిన్న గొయ్యి తీసి అందులో కొబ్బరికాయ, అరటిపండు, పచ్చిమిర్చి, పూజా సామాగ్రి వేసి ఆ గుంతను మట్టితో కప్పుతారు. దాని చుట్టూ ముగ్గులతో అలంకరించి.. ఆ తర్వాత ఇలా మట్టిని కప్పేసి గొయ్యిని పూజకార్యక్రమాలు చేస్తారు. అయితే అలా పూజా కార్యక్రమాలు చేసి దానిపై ఆవు పేడ, రొట్టెలు, కలప వేసి మంటలు పెడతారు. భోగి మంటను సరైన ముహూర్తంలో దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలా మంది ఇదే మంటపై నీరు వేడి చేసి వాటి పవిత్రమైన నీరుగా భావించి స్నానాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా
ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook