Dhantrayodashi Wishes In Telugu: ధన త్రయోదశి కూడా దీపావళి పండగలో భాగమే..ప్రతి సంవత్సరం దీపావళి పండగకు ముందు ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 12 రావడంతో కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని పదమూడవ చాంద్రమాన రోజున ధన త్రయోదశిని జరుపుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ సంవత్సరం ధన త్రయోదశి శుభ సమయం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడమే కాకుండా ఆస్తులను, కొత్త కార్లను కూడా కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు లక్ష్మిదేవితో పాటు కుబేరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజున మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలపండి.


ధన త్రయోదశి శుభాకాంక్షలు:
లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల మీ ఇళ్లు ఆనందం, శ్రేయస్సు, సుఖ, సంతోషాలతో నిండాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు.


లక్ష్మీ దేవి, కుబేరుని ఆశీర్వాదాలతో  జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు. 


ఆ కుబేరుడి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ..ప్రతి కుటుంబం సిరిసంపదలో నిండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు.


మీరు కోరుకున్న కోరికలు ఈ ధన త్రయోదశి రోజున నెరవేరాలని కోరుకుంటూ మీ అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ధన్వంతరి అనుగ్రహంతో మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..ధన త్రయోదశి శుభాకాంక్షలు.


శ్రీ మహాలక్ష్మి కరుణ మీపై ఎప్పుడు ఉండి..జీవితాంతం ఆర్థికంగా సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు. 


దీపలకాంతులతో లక్ష్మిదేవి మీ ఇంటి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు. 


సంపదను, విజయాన్ని, ఆరోగ్యాన్ని అందించే లక్ష్మీ దేవి, కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ధన్‌తేరాస్.


జ్ఞాన మార్గంలో నడిపించే ఆ లక్ష్మి అమ్మవారు మీపై ఎప్పుడు చల్లని చూపు చూడాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook