Hariyali Amavasya 2022: హిందూమతంలో చెట్లను దేవతలుగా భావించి పూజిస్తారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్యనే హరియాళీ అమావాస్య (Hariyali Amavasya 2022) అంటారు. హరియాళీ అమావాస్య రోజున చెట్లు మరియు మొక్కలు నాటుతారు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్లాంట్స్ లో ఎన్నో అనంతమైన శక్తులు ఉంటాయని హిందువులు భావిస్తారు. రావి చెట్టును నాటడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతారు. శమీ వృక్షాన్ని నాటడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అశోక వృక్షాన్ని నాటడం వల్ల ఎన్నో రోగాల నయమవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరియాళీ అమావాస్య 2022 తేదీ
హరియాళీ అమావాస్య 2022 తేదీ జూలై 27, బుధవారం రాత్రి 8:20 నుండి ప్రారంభమై...28 జూలై గురువారం రాత్రి 10:16 గంటలకు ముగుస్తుంది. 


హరియాళీ అమావాస్య రోజున, పూర్వీకులను సంతోషంగా ఉంచడానికి హవన పూజ మరియు శ్రద్ధా తర్పణం చేస్తారు. ముఖ్యంగా రోజున శివుడిని, పార్వతిని ఆరాధించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. హరియాళీ అమావాస్య రోజు చెట్లను నాటడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తాయి. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 


Also Read: Sun Transit July 2022: జూలై 16 నుంచి ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook