Sun Transit July 2022: జూలై 16 నుంచి ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది!

Sun Transit 2022: సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ప్రతి నెల సూర్యుడు తన రాశిని మారుస్తాడు. జూలై 16న మరోసారి సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 12:09 PM IST
  • జూలై 16న కర్కాటకరాశిలోకి సూర్యుడు
  • ఆగస్టు 17 వరకు అక్కడే
  • మూడు రాశులవారికి గోల్డెన్ డేస్
Sun Transit July 2022: జూలై 16 నుంచి ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది!

Sun Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. మరోసారి సూర్యభగవానుడు తన రాశిని మార్చనున్నాడు. జూలై 16న కర్కాటక రాశిలోకి (Sun Transit in Cancer 2022)  ప్రవేశించనున్నాడు. అక్కడే ఆగస్టు 17 వరకు ఉంటాడు. ఈ సూర్య సంచారం ప్రభావం మెుత్తం 12 రాశుల మీద కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రాశులవారికి గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. 

మేషరాశి (Aries) - సూర్య సంచారం మేషరాశి వారికి చాలా మేలు చేస్తుంది. వీరికి ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభిస్తుంది. అంతేకాకుండా వీరు కొత్త జాబ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఈ రాశివారు వ్యాపారంలో రాణిస్తారు. 

వృషభం (Taurus)- వృషభ రాశి వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ కాలంలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభిస్తాయి. 

మిథునరాశి (Gemini)- సూర్యుని రాశి మార్పు మిథున రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ధనం లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం.

​(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఊహలు మరియు సాధారణ సమాచారం పై ఆధారపడి ఉంటుంది.  ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Bhadli Navami 2022: భడ్లీ నవమి ఎప్పుడు? దీని ప్రాధాన్యత ఏంటి?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News