Hariyali Amavasya 2022: శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే హరియాళీ అమావాస్య అంటారు. ఈ ఏడాది జూలై 28, గురువారం నాడు హరియాళీ అమావాస్యను (Hariyali Amavasya 2022) జరుపుకుంటారు.  ఈ రోజు స్నానం, దానం, ఉపవాసం, తర్పణాలకు విశేష ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ఈ రోజు మెుక్కలు నాటడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ అమావాస్య నాడు పవిత్రమైన మెుక్కలు నాటుతారు. దీని ద్వారా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వీరి నమ్మకం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరియాళీ అమావాస్య తేదీ మరియు సమయం
ఏకాదశి తేదీ ప్రారంభం - బుధవారం, జూలై 27, 2022, రాత్రి 09:11 నుండి
ఏకాదశి తేదీ ముగింపు - గురువారం, 28 జూలై 2022, రాత్రి 11:24 నుండి


హరియాళీ అమావాస్య ప్రాముఖ్యత
హరియాళీ అమావాస్య రోజున చెట్లను సంరక్షించడం మరియు నాటడం ద్వారా మనిషి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరియు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున శివపార్వతులను పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈరోజున పేదలకు దానం చేయడం మంచిది. ఈ అమావాస్య రోజున దేవతలు కొలువై ఉండే చెట్లను, మొక్కలను నాటాలి. ఈ రోజున రావి, వేప, అరటి, మర్రి, తులసి మరియు ఉసిరి వంటి చెట్లును నాటడం శుభప్రదంగా భావిస్తారు.  ఈ మొక్కలను నాటడం ద్వారా దేవుడితోపాటు పూర్వీకులు ఆశీస్సులు మీకు లభిస్తాయి.


Also Read: Hariyali Teej 2022: హరియాలీ తీజ్ ఎందుకు జరుపుకుంటారు? ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    



 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook