Hariyali Teej 2022 Date: హరియాలీ తీజ్ వ్రతాన్ని నార్త్ ఇండియాలో జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల పెళ్లికాని అమ్మాయిలకైతే నచ్చిన అబ్బాయితో వివాహం అవుతుంది. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. హరియాలీ తీజ్ (Hariyali Teej Vrat 2022) ను శ్రావణ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. ఇది ఈ ఏడాది 31 జూలై 2022, ఆదివారం నాడు వచ్చింది. ఈ రోజున స్త్రీలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. మేకప్ వేసుకుంటారు. ఈసారి హరియాలీ తీజ్‌లో కూడా శుభ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి.
హరియాలీ తీజ్ ఎందుకు జరుపుకుంటారు?
పురాణాల ప్రకారం, పార్వతీపరమేశ్వరుల పునఃకలయిక ఈ రోజున జరిగింది. మహాదేవుడిని భర్తగా పొందేందుకు పార్వతీమాత 107 జన్మలపాటు కఠోర తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. 108 జన్మలో ఆమె నిరీక్షణ ఫలించి శివుడిని వివాహం చేసుకుంది. పెళ్లికాని అమ్మాయిలు ఈ రోజున ఉపవాసం ఉంటే, వారికి ఇష్టమైన వరుడు లభిస్తాడని నమ్ముతారు.
అదే రోజు రవియోగం
హరియాళీ తీజ్ నాడు పవిత్రమైన రవి యోగం కూడా ఏర్పడుతోంది. ఈ యోగం పూజలు, మతపరమైన కార్యకలాపాలకు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ యోగంలో చేసే పనులు శుభఫలితాలను ఇస్తాయి. జూలై 31వ తేదీ మధ్యాహ్నం 02:20 గంటల నుండి ఆగస్టు 1వ తేదీ ఉదయం 06:04 గంటల వరకు రవియోగం ఉంటుంది. హరియాళీ తీజ్ రోజున పార్వతీపరమేశ్వరులను పూజించడంతో పాటు, మాత పార్వతికి అలంకరణ వస్తువులను సమర్పించండి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook