Hindu New Year 2024 Locky Zodiac Sign: హిందువుల నూతన సంవత్సరం ఉగాది పండుగ నుంచి ప్రారంభమవుతుంది. పంచాంగం(panchangam) ప్రకారం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరానికి అధిపతిగా కుజుడు, మంత్రిగా శని ఉండబోతున్నారు. దీని కారణంగా ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే అతి శక్తివంతమైన మూడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. చైత్ర నవరాత్రుల్లో భాగంగా అమృత సిద్ది యోగం, శశా రాజయోగంతో పాటు మరో రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ఏప్రిల్ 9వ తేదీన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమృత సిద్ధ యోగం ఏర్పడింది. ఈ శుభయోగం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రోజంతా కొనసాగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ నూతన సంవత్సర చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఏడాది పొడవునా అదృష్టం లభించడమే, కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబంలో సంతోషం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.


ప్రత్యేక యోగాల కారణంగా లాభాలు పొందబోయే రాశులు వీరే..
మేష రాశి:

మేష రాశి వారికి నూతన సంవత్సరం చాలా శుభ్రంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పనిలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడమే, కాకుండా అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా ఈ ఏడాదిలో గుడ్ న్యూస్ వింటారు. అలాగే మేషరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికి ధన లాభాలు కూడా కలుగుతాయి.


మిధున రాశి:
ఈ క్రోధినామ సంవత్సరంలో మిధున రాశి వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరు పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులను పొందే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి ఈ సమయం చాలా సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.


సింహరాశి:
సింహ రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో పదోన్నతులు పొందడమే కాకుండా జీతాలు కూడా పెంచుకోగలుగుతారు. అలాగే వృత్తి జీవితం చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కారమవుతాయి. దీనితో పాటు సంతోషం కూడా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగి దాంపత్య జీవితం పచ్చగా ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు కూడా ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం శృంగార భరితంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రేమ మరింత బలపడి వివాహంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు కూడా పొందగలుగుతారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి