Money Plant, Tulasi Plant, Shami Plant and Banana Plant do not placed in these direction in house: పల్లె, పట్టణాల్లో అయినా ప్రతి ఇంటి లోపల లేదా వెలుపల చెట్లు మరియు మొక్కలు ఉండడం సహజం. ఇల్లు అందంగా కనిపించడానికి చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆక్సిజన్, చల్ల గాలిని కూడా ఇవి ఇస్తుంటాయి. అంతేకాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఇంట్లోని మొక్కలు మనిషి ప్రగతికి బాటలు వేస్తాయి. అయితే చెట్లు మరియు మొక్కలు సరైన దిశలో ఉంటేనే లాభదాయకమని వాస్తుశాస్రంలో చెప్పబడింది. తప్పు దిశలో నాటితే మాత్రం దరిద్రం ఇంట్లో తాండవిస్తుందట. మొక్కలను ఏ దిశలో నాటాలో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటి మొక్క:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అరటి మొక్కలో విష్ణువు మరియు దేవగురు బృహస్పతి ఉంటారట. అందుకే గ్రంధాలలో అరటి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అరటి పండును ప్రతి పూజలో కూడా ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరటి మొక్కను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో అస్సలు నాటకూడదు. ఈశాన్యంలో నాటడం మంచిది.


మనీ ప్లాంట్‌:
ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కడైనా సరే మనీ ప్లాంట్‌ను నాటవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో దక్షిణ దిక్కున మనీ ప్లాంట్‌ను పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ కోణం (ఆగ్నేయం) దిశలో నాటడం శుభప్రదంగా ఉంటుందట. 


శమీ మొక్క:
గ్రంధాల ప్రకారం శమీ మొక్క (జమ్మి చెట్టు)ను శుభప్రదంగా భావిస్తారు. ఇది శివునికి ఎంతో ప్రీతికరమైనది. పొరపాటున కూడా ఈ మొక్కను ఇంట్లో దక్షిణ దిశలో నాటొద్దు. పొరపాటున ఈ మొక్కను దిశలో దక్షిణ నాటితే.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. తూర్పు లేదా ఈశాన్యంలో నాటితే మంచిది. ఈ దిశలలో శమీ మొక్కను నాటడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి.


తులసి మొక్క:
హిందూ మతంలో తులసి మొక్కను రోజూ పూజిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో సరైన దిశలో నాటితే ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. అంతేకాదు డబ్బు నిల్వ ఉంటుంది. తులసిని దక్షిణ దిశలో ఎప్పుడూ నాటకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. తులసి మొక్కను తూర్పు-ఉత్తర దిశలలో నాటాలి.


Also Read: FIFA World Cup 2022: సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ఫ్రాన్స్‌! రికార్డులు ‍బ్రేక్‌  


Also Read: Gold Price Today: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.