Horoscope Dhanteras: ధన త్రయోదశి రోజే ప్రత్యేక యోగాల ఏర్పాటు..ఈ రాశులవారు ఎప్పుడు పొందలేని లాభాలు పొందబోతున్నారు!
Horoscope Dhanteras: ధన త్రయోదశి రోజు కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Horoscope Dhanteras: ఈ సంవత్సరం ధన త్రయోదశి శుక్రవారం రావడంతో పాటు ప్రదోష కాలం ఏర్పడమే కాకుండా 5 అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా ఇదే సమయంలో చంద్ర గ్రహం కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో పాటు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. కన్యారాశిలో శుక్రుడు, చంద్రుడు సంచారం చేయడం వల్ల ధన త్రయోదశి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతో ప్రముఖ్యత కలిగిన ప్రీతి యోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ధన త్రయోదశి కారణంగా ఏయే రాశివారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక యోగాల ఎఫెక్ట్:
మేష రాశి:
ధన త్రయోదశి రోజు ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో షాపింగ్ చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఇంతకముందు పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ధన త్రయోదశి పండగ చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. దీంతో పాటు లక్ష్మిదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశివారు ఈ ప్రత్యేక యోగాల ప్రభావంతో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ ధన త్రయోదశి సందర్భంగా ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ధన త్రయోదశి సందర్భంగా వాహనాలు లేదా ఆభరణాల కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు ఇది ప్రత్యేక సమయంగా చెప్పొచ్చు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందుతారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook