Horoscope Today: కార్తీక మాసం ఇప్పటికే మెుదలైంది. ఈ మాసం శుభప్రదమైనది అయినప్పటికీ చాలా మంది ఏ కార్యం తలపెట్టాలన్నా మంచి ముహూర్తం ఉందా లేదా రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూస్తూ ఉంటారు. మరి ఈరోజు అంటే నవంబరు 7న రాశిఫలాలు (Horoscope on 07th November 2022) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Areis): ఈ రాశివారికి మిశ్రమ కాలం నడుస్తోంది. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా మీకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
వృషభం (Taurus); వీరికి ఈరోజు శుభఫలితాలు కలుగుతాయి. తమ తెలివితేటలతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలుగుతారు. ఇతరులను ఆకర్షించగలుగుతారు. వీరు ఎలాంటి ఒత్తిడిని దరిచేరనీయరు.
మిథునం (Gemini): మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీరు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని పనులు పూర్తిచేస్తారు.
కర్నాటకం (Cancer): పెండింగ్ లో ఉన్న పనులన్నీ మళ్లీ మెుదలవుతాయి. ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న మీకు కలిసి వస్తుంది. 
సింహం (Leo): ఈరోజు మీకు చాలా బాగుంటుంది. శుభవార్త వింటారు. మీరు అందరి ప్రశంసలు అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. 
కన్య (Virgo): ఈరాశివారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. 


తుల (Libra): ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  
వృశ్చికం (Scorpio): ఈరోజు మీరు ఏ పని చేపట్టినా అందులో అడ్డంకులు ఉంటాయి. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో పెద్దలను కలిసే అవకాశం ఉంది. 
ధనస్సు (Sagittarius): కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కొన్ని విషయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో ఆచి తూచి వ్యవహరించండి. 
మకరం(Capricorn): మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీ అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. మీ పనికి అందరి ప్రశంసలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  పాల్గొనే అవకాశం ఉంది. 
కుంభం (Aquarius): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.  విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
మీనం (Pisces): శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సహచరుల సహకారంతో అన్ని పనులన్నీ పూర్తిచేస్తారు. మెుత్తానికి ఈరోజు అంతా మీకు కలిసి వస్తుంది. 


Also read: Dev diwali 2022: దేవ్ దీపావళి నవంబర్ 7 లేదా 8? సరైన తేదీ, ముహూర్తం, విశిష్టత తెలుసుకోండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook