Dev diwali 2022, Kartik Purnima: పంచాగం ప్రకారం, దేవ్ దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇదే రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబరు 8 తేదీన వచ్చింది. ఇదే రోజు చంద్ర గ్రహణం కూడా ఉంది. ఈ గ్రహణం కారణంగా దేవ్ దీపావళి ఫెస్టివల్ (Dev diwali 2022)ను నవంబరు 7న జరుపుకుంటున్నారు. ఈసారి కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 07 సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమవుతుంది. పౌర్ణమి స్నానం నవంబరు 8న చేస్తారు. ఈ సారి కార్తీక పౌర్ణమి రోజున అనేక శుభయోగాల కలయిక ఏర్పడుతోంది. ఈరోజున దేవతలను పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది.
దేవ్ దీపావళి 2022 ముహూర్తం
** కార్తీక పూర్ణిమ తేదీ ప్రారంభం - 07 నవంబర్ 2022, సాయంత్రం 04.15
** కార్తీక పూర్ణిమ తేదీ ముగింపు - 08 నవంబర్ 2022, సాయంత్రం 04.31
** ప్రదోష కాలంలో దేవ్ దీపావళి ముహూర్తం - సాయంత్రం 05:14 - సాయంత్రం 07:49 (7 నవంబర్ 2022)
** దేవ్ దీపావళి రోజున సూర్యాస్తమయం తర్వాత నది లేదా చెరువులో దీపాలను వదులుతారు. ఇలా చేయడం వల్ల అకాల మృత్యుభయం తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.
కార్తీక పూర్ణిమ 2022 ముహూర్తం
** కార్తీక పూర్ణిమ నాడు గంగాస్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి, అయితే ఈ స్నానం సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో చేయాలి.
**బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04:57 - ఉదయం 05:49
** అభిజీత్ ముహూర్తం - ఉదయం 11:48 - మధ్యాహ్నం 12:32.
దేవ్ దీపావళి రోజున మూడు యోగాలు
ఈ సంవత్సరం దేవ్ దీపావళి మరియు కార్తీక పూర్ణిమ తిథి ముగిసే లోపల మూడు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి సోమవారం వస్తుంది కాబట్టి దీని విశిష్టత మరింత పెరిగింది. ఈరోజున శివారాధన చేయడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.
** సిద్ధి యోగం - 06 నవంబర్ 2022, 11.50 pm - 07 నవంబర్ 2022, 10.37
** సర్వార్థ సిద్ధి యోగం - 12.04 AM - 06.41 AM (07 నవంబర్ 2022)
** రవి యోగం - 7 నవంబర్ 2022, 06.41 AM - 8 నవంబర్ 2022, 12.37 AM
Also Read: Shukra Gochar 2022: వృశ్చికరాశిలోకి శుక్రుడు... నవంబర్ 11 నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook